భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.. బలవంతంగా కారులో ఎక్కించి.. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై..

పోలీసుల అదుపులో నిందితులు

Gang Rape: ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. కామంతో కళ్లు మూసికుపోయిన కామాంధులు నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా బైక్‌పై వెళ్తున్న దంప‌తుల‌ను అడ్డుకున్న దుండ‌గులు భ‌ర్త‌ను తీవ్రంగా కొట్టి దంప‌తులిద్ద‌రిని కారులోకి ఎక్కించారు. భ‌ర్త ఎదురుగా భార్య‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 • Share this:
  ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోనే మరో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ రాష్ట్రంలో దారుణ సంఘటన వెలుగు చూసింది. భర్తను చితకబాది.. అతని భార్య పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  రాజస్థాన్ రాష్ట్రంలోని బాడ్మెర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. బార్మెర్‌కు చెందిన దంపతులు బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మహిళపై ముగ్గురు కామాంధుల కన్ను పడింది. మార్గ‌మ‌ధ్యంలో న‌లుగురు దుండ‌గులు వీరిని అడ్డ‌గించారు. అందులో ఒక‌డు ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని తీసుకెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు భ‌ర్త‌ను కొట్టి తీవ్రంగా గాయ‌పరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఎంత ఘోరంగా అత్యాచారం చేశారంటే.. భర్త చూస్తుండగానే ఒకరి తర్వాత మరొకరు ఘోరానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత కూడా వారిపై చేయి చేసుకొని ఓ ప్రాంతంలో వ‌దిలివేసి వెళ్లారు.

  Read Also: అతడు ప్రైవేట్ టీచర్.. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు నటించాడు.. స్నేహితుడి రూంకి తీసుకెళ్లి..


  తేరుకున్న బాధితురాలు.. భ‌ర్త సాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాబులాల్, నరేష్‌, క‌మ్తాయ్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం కోర్టులో హాజరుపర్చ నున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. ప‌రారీలో ఉన్న మ‌రో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు
  Published by:Veera Babu
  First published: