ఏపీలో దారుణం... ప్రియుడ్ని బంధించి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు.

news18-telugu
Updated: July 21, 2019, 8:28 AM IST
ఏపీలో దారుణం... ప్రియుడ్ని బంధించి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో కారంచేడులో ఓ యువతి గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రియుడిని నిర్బంధించి ముగ్గురు యువకులు... ప్రియారాలిపై అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చీరాల పట్టణం విఠల్‌ నగర్‌ కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుని.. తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తుండగా, ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులు దోచుకున్నారు.

యువకునిపై దాడిచేసి యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసును నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కామాంధుల కోసం గాలిస్తున్నారు.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>