దేశంలో నిర్భయ తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో ఓ 20 ఏళ్ల యువతిపై కొందరు దొంగలు సాముహిక అత్యాచారానికి (Woman Gang-raped by Robbers) పాల్పడ్డారు. లక్నో నుంచి ముంబైకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో (Lucknow-Mumbai Pushpak Express) ఈ దారుణం జరిగింది. మహారాష్ట్రలోని ఇగత్పురి, కాసారా రైల్వే స్టేషన్ల మధ్య పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. ముంబై జీఆర్పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఎక్స్ప్రెస్ ఘాట్ సెక్షన్లో ప్రయాణిస్తున్నప్పుడు నిందితులు ఆరోపించిన ఈ నేరం చేసినట్టుగా చెప్పారు.
నిందితులు లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ (Pushpak Express) స్లీపర్ బోగీ డీ-2లోకి ఇగత్పురి ఎక్కారు. రైలు ఘాట్ ప్రాంతానికి చేరుకోగానే కత్తలు, ఇతర ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోపిడికి పాల్పడ్డారు. వారి ఫోన్స్, డబ్బులు, నగలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే రైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై నిందితులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రైలు కాసారా రైల్వే స్టేషన్కు (Kasara railway station) చేరుకున్నప్పుడు ప్రయాణికులు సాయం కోసం కేకలు వేశారని ముంబై జీఆర్పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ (Quaiser Khalid) ట్విట్టర్లో తెలిపారు. సిబ్బంది వెంటనే స్పందించారని, నలుగురు నిందితులను పట్టుకున్నామని ఆయన చెప్పారు. బాధితురాలిని మహిళా పోలీస్ అధికారి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్టుగా తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు క్షేమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని రకాల ఆధారాలను రైల్వే పోలీసులు సేకరిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను ప్రశ్నిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
Hyderabad Rains: సినిమా థియేటర్ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు క్రైమ్ బ్రాంచ్ బృందం నేరంపై దర్యాప్తు చేస్తున్నాయని జీఆర్పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ తెలిపారు. రైలు ప్రయాణికుల నుంచి నిందితులు రూ .96,390 విలువైన ఆస్తులను దొంగిలించారని తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ .34,200 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. నిందితులపై ఐపీసీ 395, 397, 376(డీ), 354 సెక్షన్ల కింద జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, Maharashtra