దారుణం: ఒక మహిళపై 8 మంది మృగాళ్ల లైంగిక దాడి...

మహిళను అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్లగా అక్కడ కాచుకొని ఉన్న ఏడుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

news18-telugu
Updated: August 24, 2019, 10:21 PM IST
దారుణం: ఒక మహిళపై 8 మంది మృగాళ్ల లైంగిక దాడి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 24, 2019, 10:21 PM IST
హర్యానాలో ఓ మహిళపై ఎనిమిది అత్యంత పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే… యుపికి చెందిన బాధిత మహిళ కర్నాల్ రైల్వే స్టేషన్‌లో రైలుకోసం ఎదురుచూస్తుండగా...ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఆహారం ఉందని, తన వెంట వస్తే భోజనం చేయవచ్చని నమ్మించాడు. ఆ మహిళను అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్లగా అక్కడ కాచుకొని ఉన్న ఏడుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయిన అనంతరం ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ మహిళ తీవ్రంగా గాయపడిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి సిసి కెమెరాల రికార్డు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...