సోదరుడి బైక్ పై వెళుతున్న యువతిని అడ్డగించి... అడవిలోకి తీసుకెళ్లి దారుణం...

బైకులపై వచ్చిన ముగ్గురు యువ‌కులు యువ‌తి సోద‌రుడిపై ముందుగా దాడికి పాల్ప‌డ్డారు. అత‌డిని ప‌క్క‌నే ఉన్నకాలువలో ప‌డేసి.. ఆ యువ‌తిని స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

news18-telugu
Updated: August 2, 2020, 11:26 PM IST
సోదరుడి బైక్ పై వెళుతున్న యువతిని అడ్డగించి... అడవిలోకి తీసుకెళ్లి దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. సోద‌రుడితో క‌లిసి వివాహ వేడుకకు వెళ్లిన యువతిపై నలుగురు ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రాష్ట్రంలో నేరాల రేటు త‌గ్గుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలో ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్థానిక జంషెడ్ పూర్ నగరానికి స‌మీప గ్రామానికి చెందిన యువ‌తి ఈషా ( పేరు మార్చాం) శనివారం త‌న సోద‌రుడితో క‌లిసి జంషెడ్ పూర్ లో వివాహ వేడుకకు బయలు దేరింది. బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో కొందరు కుర్రాళ్లు లిఫ్ట్ ఇస్తామంటూ ముందుకు వచ్చారు. దీంతో యువతిని తమ బైక్ ఎక్కమన్నారు. అందుకు ఆమె వద్దని చెప్పింది. దీంతో బైకులపై వచ్చిన ముగ్గురు యువ‌కులు యువ‌తి సోద‌రుడిపై ముందుగా దాడికి పాల్ప‌డ్డారు. అత‌డిని ప‌క్క‌నే ఉన్నకాలువలో ప‌డేసి.. ఆ యువ‌తిని స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

కాలువలో పడ్డ యువకుడు వెంటనే కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించాడు. అక్క‌డికి చేరుకున్న కుటుంబ స‌భ్యులు యువ‌తి ఆ చుట్టు ప్ర‌క్క‌ల వెతకగా.యువ‌తి పొదల్లో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది. యువ‌తిని వెంటనే ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నాడని తెలిపారు. మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నార‌ని త్వ‌రలోనే వారిని ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading