• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • WOMAN GANG RAPED BY 17 MEN IN FRONT OF HER HUSBAND IN JHARKHANDS DUMKA MS

Gang Rape: భర్త చూస్తుండగానే... మహిళపై 17 మంది గ్యాంగ్ రేప్

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape In Jharkhand: రోడ్డు మీద వారి వీరంగాన్ని చూసిన ఆ భార్యాభర్తలిద్దరూ.. భయంతో ఇంటికి బయల్దేరారు. తీరా ఇంటికి వచ్చిన ఆ దుర్మార్గులు.. దారుణానికి ఒడిగట్టారు. సుమారు 17 మంది కలిసి ఆ మహిళ మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    ఆమె ఐదుగురు బిడ్డల తల్లి. భర్తతో కలిసి ఒక పనిమీద బయటకు వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న సందర్భంలో వారిని ఒక గుంపు సభ్యులు వేధింపులకు గురిచేశారు. మహిళను చూస్తూ వెకిలి చేష్టలు చేశారు. ఆమెను చూపిస్తూ అసభ్యంగా మాట్లాడారు. రోడ్డు మీద వారి వీరంగాన్ని చూసిన ఆ భార్యాభర్తలిద్దరూ.. భయంతో ఇంటికి బయల్దేరారు. తీరా ఇంటికి వచ్చిన ఆ దుర్మార్గులు.. దారుణానికి ఒడిగట్టారు. సుమారు 17 మంది కలిసి ఆ మహిళ మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇదంతా ఆమె భర్త ఎదురుగుండానే జరిగింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ లో వెలుగు చూసింది. వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముఫిసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న భార్యాభర్తలిద్దరూ.. ఒక పనిమీద బయటకు వెళ్లారు. వాళ్లు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వారిని వేధించిన దుండగులు.. కొద్ది సేపటి తర్వాత సరాసరి ఇంటికే తిరిగివచ్చారు. ఆపై ఆ భర్తను పట్టుకుని కొట్టారు. గుంపు వచ్చి మీద పడ్డట్టుగా పడటంతో ఆ భర్త ఏమీ చేయలేకపోయాడు. నిందితులు కర్రలు, రాడ్లతో వాళ్లింటికి వచ్చి దౌర్జన్యం చేశారు. తన భర్తను వదిలేయాలని ఆయన భార్య ప్రాధేయపడినా వినలేదు. అనంతరం ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

    ఇది కూడా చదవండి.. Telangana: అన్నం పెట్టిన వృత్తే ఆయువు తీసింది.. కరెంట్ షాక్ కు గురై ఇద్దరి మృతి

    నొప్పి తట్టుకోలేక ఆ మహిళ అరుస్తున్నా.. అందులో ఒక్కరికి కూడా కనికరం కలుగలేదు. ఒకరి తర్వాత ఒకరు.. మొత్తం 17మంది వెళ్లి ఆ మహిళను రేప్ చేశారు. ఇప్పటికే ఐదుగురు బిడ్డల తల్లి అయిన ఆ మహిళ.. తాజా ఉదంతంతో స్పృహ తప్పి పడిపోయింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ లో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Srinivas Munigala
    First published: