గుంటూరులో గ్యాంగ్ రేప్... రోడ్డుపై నగ్నంగా పరిగెత్తిన మహిళ

కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే కొద్ది దూరం పరిగెత్తినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమెను ఆ దుర్మార్గులు వదలడం లేదు.

news18-telugu
Updated: February 18, 2020, 11:42 AM IST
గుంటూరులో గ్యాంగ్ రేప్... రోడ్డుపై నగ్నంగా పరిగెత్తిన మహిళ
Video : మహిళపై గ్యాంగ్ రేప్.. తప్పించుకోబోయిన నిందితుడు మృతి
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ దిశ వంటి కీలకమైన చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ అబలపై మరో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి ఆ నీఛులు ఒడిగట్టారు. కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే కొద్ది దూరం పరిగెత్తినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమెను వదలని ఆ దుర్మార్గులు.... మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నారని చెబుతున్నారు. అందుకే, ఈ కేసును గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. నేరానికి పాల్పడింది ఎవరైనా సరే... వదలకుండా కఠినంగా శిక్షించాలని బాధితురాలితో పాటు.. గ్రామస్థులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఐటీఐ విద్యార్థిగా గుర్తించారు. ఇద్దరికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 366, 376, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

తాడేపల్లికి చెందిన మహిళ విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చినకాకానికి చెందిన చైతన్య విజయవాడలో ఐటీ చదువుతున్నాడు. రోజూ ఉద్యోగం కోసం బస్సులో వెళ్తున్న క్రమంలో ఆమెకు చైతన్య పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు చైతన్య. అక్కడ మరో ఇద్దరు స్నేహితుల్ని తీసుకొచ్చాడు. ముగ్గురు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే మహిళ వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కనస్ట్రక్షన్స్ కూడా చేయించారు. ముగ్గురులోకి ఇద్దరికి నేర చరిత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు. దిశ చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సర్వత్రా కలకలం రేపుతోంది.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు