హోమ్ /వార్తలు /క్రైమ్ /

మంకుపట్టువదలని భార్య.. రోడ్డు మీద వాగ్వాదం.. ఇంతలో 6 గురు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

మంకుపట్టువదలని భార్య.. రోడ్డు మీద వాగ్వాదం.. ఇంతలో 6 గురు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jharkhand: భార్య తన భర్తతో గొడవ పడి ఇంటినుంచి బైటకు వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ భర్త, మరికొందరు వెళ్లారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India

కొన్నిసార్లు భార్యభర్తల మధ్య బేధాభిప్రాయాలు వస్తుంటాయి. కొందరు దీన్ని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటారు. మరికొందరు మాత్రం అలా కాకుండా ప్రతిచిన్న విషయానికి గొడవలు (Family dispute) పడుతుంటారు. కొంత మంది కట్నం తేలేదని, భార్య అందంగా లేదని గొడవలు పడుతుంటారు. ఇక తమ భర్త దగ్గర డబ్బులు లేవని, తమను బాగా చూసుకొవడంలేదంటూ గొడవలు పడుతుంటారు. కొందరు భార్యభర్తలు.. పెళ్లాయ్యాక వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ కాపురాన్ని చేతులారా నాశనం చేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి పుట్టింటికి వెళ్ళి కూర్చుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. జార్ఖండ్ లో (Jharkhand) అమానుష ఘటన జరిగింది. పాలము జిల్లాలో 22 ఏళ్ల యువతి తన భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బైటకు వెళ్లిపోయింది. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ భర్త, మరో బంధువు చుట్టుపక్కల చూస్తు వెళ్తున్నారు. ఇంతలో.. యువతి భర్త కంట పడింది. అప్పటికే చీకటి పడింది. ఆ ప్రాంతం కాస్త నిర్మానుష్యంగా ఉంది. దంపతులు రోడ్డుపైన గొడవ పడుతున్నారు. ఇంతలో కొందరు అటుగా బైక్ ల మీద వెళ్తున్నారు. దుండగులు కళ్లు కాస్త.. యువతిపై పడ్డాయి.

దీంతో మరల వెనక్కు వచ్చి... వీరిపై దాడిచేశారు. యువతి భర్తను పక్కకు తోసేశారు. అతడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. వివాహితను పోదల్లోనికి తీసుకెళ్లి సాముహిక అత్యాచారం చేశారు. కాగా, భర్త కళ్ల ముందే దుండగులు వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాత.. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆమె షాకింగ్ లో ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని భర్త, మరికొందరు అక్కడికి రావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకుని స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మహిళ పరిస్థితి (Woman harassment)  విషమంగా ఉండడంతో మేదినీనగర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేరిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సత్బర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రిషికేష్ కుమార్ రాయ్ తెలిపారు. నిందితులలో ఇద్దరు యువతి బంధువులని సమాచారం. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Jharkhand

ఉత్తమ కథలు