హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Accuses Husband: భర్త ఎంతటి స్త్రీలోలుడో బయటపెట్టిన భార్య.. భర్తకు తెలియకుండా అతని స్మార్ట్‌ఫోన్‌లో గ్యాలరీ ఓపెన్ చేసి..

Wife Accuses Husband: భర్త ఎంతటి స్త్రీలోలుడో బయటపెట్టిన భార్య.. భర్తకు తెలియకుండా అతని స్మార్ట్‌ఫోన్‌లో గ్యాలరీ ఓపెన్ చేసి..

భర్తతో ఏడడుగులు కలిసి నడిచింది. అణకువగా నడుచుకుంటూ కాపురం చేసింది. కానీ.. భర్త నిజ స్వరూపం తెలిసి నిర్ఘాంతపోయింది. తన భర్త స్త్రీలోలుడన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఎందరో అమాయక యువతులను, మహిళలను తన భర్త బ్లాక్‌మెయిల్ చేస్తూ...

ఇంకా చదవండి ...

  మీరట్: భర్తతో ఏడడుగులు కలిసి నడిచింది. అణకువగా నడుచుకుంటూ కాపురం చేసింది. కానీ.. భర్త నిజ స్వరూపం తెలిసి నిర్ఘాంతపోయింది. తన భర్త స్త్రీలోలుడన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఎందరో అమాయక యువతులను, మహిళలను తన భర్త బ్లాక్‌మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటూ, వారిని బలవంతం చేసి శారీరక సుఖం పొందుతున్నాడని తెలిసి ఆమె కడుపు రగిలిపోయింది. తప్పుడు పనులు చేస్తున్నది భర్తయినా సరే ఆమె వెనకేసుకుని రాలేదు. తన భర్తను ఇలానే వదిలేస్తే మరెంతో మంది అమాయక మహిళల మానానికే ప్రమాదమని భావించింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి అసలు విషయం చెప్పింది. దీంతో.. ఆ ప్రబుద్ధుడి నిర్వాకం వెలుగులోకొచ్చింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని మీరట్ జిల్లా ఖర్కౌడా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం హపూర్ బస్టాండ్ దగ్గర ఓ మహిళతో చనువుగా కనిపించిన తన భర్తను చూశానని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. తన భర్త మహిళలను ట్రాప్ చేసి వారిని బ్లాక్‌బెయిల్ చేసి బెదిరించి.. వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించేవాడని ఫిర్యాదులో ఆమె తెలిపింది.

  అంతేకాకుండా, వారిని బలవంతం చేసి శారీరక అవసరం తీర్చుకునేవాడని మహిళ చెప్పింది. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌‌ఎస్‌పీ)ని కలిసింది. తన భర్త ఫోన్‌ గ్యాలరీలో బాధిత మహిళలకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. వాటిని తన భర్తకు తెలియకుండా తాను సేకరించానని పోలీసులకు సదరు మహిళ సాక్ష్యాలను సమర్పించింది. తన భర్తతో కలిసి కొందరు ఈ రాకెట్‌ను నడుపుతున్నారని ఆమె చెప్పింది.

  మహిళలను మాయమాటలతో నమ్మించి ట్రాప్ చేయడం, వారిని బ్లాక్‌మెయిల్ చేసి వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించడమే పనిగా ఈ రాకెట్ నడుపుతున్నారని ఆ మహిళ చెప్పింది. తన భర్త బండారం బయటపెడతానని హెచ్చరించిన తనను బావ మరుదులు గ్యాంగ్ రేప్ చేశారని.. ఆ అకృత్యాన్ని వీడియో రికార్డ్ చేశారని ఆమె తెలిపింది. తన అన్నయ్య గురించి బయట చెబితే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారని మహిళ వాపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎస్‌ఎస్‌పీని కలిసి తన భర్త బాగోతం చెప్పానని మహిళ తెలిపింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మీరట్ ఎస్‌ఎస్‌పీ ఆదేశించారు.

  First published:

  Tags: Blackmail, Crime, Crime news

  ఉత్తమ కథలు