Home /News /crime /

WOMAN FILES CHEATING CASE ON LOVER IN KUKATPALLY VB

Cheating: విప్రోలో ఉద్యోగం.. పెళ్లిపేరుతో శారీరకంగా అనుభవించి.. రూ. 37 లక్షలతో పరార్.. విచారణ చేపట్టిన పోలీసులకు షాక్.. అతడికి అప్పటికే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cheating: ఉద్యోగం ఇచ్చాడనే కృతజ్ఞతతో అతడితో చనువుగా మెలిగింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి ఆ యువతిని మోసం చేయడంతో పాటు రూ.37లక్షలను కాజేశాడు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    అతడు విప్రో లో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందని తెలుకొని ఓ యువతి ఇంటర్వ్యూ కి వెళ్లింది. ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు టీమ్ లీడర్ తెలపడంతో అప్పటినుంచి ఆమె అతడితో చనువుగా ఉండటం మొదలు పెట్టింది. నిత్యం ఫోన్ లు, చాటింగ్ ఇలా స్నేహితులనుకున్నవారు ప్రేమికులుగా మారారు. అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ రోజు ఇంటికి పిలిపించుకున్నాడు. శారీరకంగా అనుభవించాడు. అనంతరం అతడు సొంతంగా బిజినెస్ మొదలు పెడుతున్నట్లు ఆమెను నమ్మించి దానికి పెట్టుబడి కావాలంటూ ఆమెను అడిగాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటాడు కదా అని ఆమె నమ్మి మూడుధపాలుగా దాదాపు రూ .37 లక్షలను ఇచ్చింది. తర్వాత రోజునుంచి అతడి సెల్ స్విచ్ఛాఫ్. మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని మహారాష్ట్ర లోని నాసిక్ లో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

    మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జాయ్‌ (32) విప్రో సంస్థలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీకి ఆల్వాల్‌కు చెందిన ప్రీతి (28) ఉద్యోగం కోసం వెళ్లింది. జాయ్‌ ఇంటర్వ్యూ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మూసాపేటలోని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం శారీరకంగా ఇద్దరూ కలిశారు. తాను బిజినెస్‌ చేస్తున్నానని, నీదగ్గర డబ్బు ఉంటే ఇయ్యాలని కోరగా ఆమె అతని మాటలు నమ్మిన దాచుకున్న 10 లక్షలు అతడికి అందజేసింది. ఇంకా డబ్బు అవసరముందని చెప్పడంతో ఆమె పలు బ్యాంకుల్లో రుణం తీసుకొని సుమారు రూ. 27 లక్షలు అందజేసింది. మొత్తం రూ. 37 లక్షలు అతడికి ఇచ్చింది. అయితే అప్పటి నుంచి బ్యాంకు వాళ్లు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. రుణానికి సంబంధించిన వాయిదాలు ఎప్పుడు కడతావని. ఓ రోజు జాయ్ ని నిలదీసింది.

    అప్పటి నుంచి అతడు ఫోన్ స్విచాఫ్ పెట్టడమే కాకుండా ఆమెను దూరం పెట్టాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే అతడికి పెళ్లి అయినట్లు తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రీతిని పిలిచానని తెలిపాడు. అతడి బ్యాంకు అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను సీజ్ చేసి అతడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Cheating case, Crime, Crime news, Hyderabad, Kukatpally, Love affair, Lover cheating, Telangana crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు