HOME » NEWS » crime » WOMAN FACED PROBLEMS IN GULF AND RAPED BY 10 MEN HERE ARE THE DETAILS MK

ఆ ఇంట్లో మత్తుమందు ఇచ్చి రోజుకు 10-15 మంది నాతో సెక్స్ చేసేవాళ్ళు...గల్ఫ్ లో నరకం..

కమ్లీని షేక్ కుమారులు సైతం రేప్ చేసేవారు. దీంతో కమ్లీ ప్రాణాలను అరచేతపట్టుకొని బిక్కు బిక్కు మంటూ బతికింది. రోజుకు 10 నుంచి 15 మంది ఆమెను రేప్ చేసేవారు. అయితే దాదాపు 6 నెలల పాటు నరకం చూసింది.

news18-telugu
Updated: December 2, 2020, 10:05 AM IST
ఆ ఇంట్లో మత్తుమందు ఇచ్చి రోజుకు 10-15 మంది నాతో సెక్స్ చేసేవాళ్ళు...గల్ఫ్ లో నరకం..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గల్ఫ్ అంటేనే ఎండమావులు అలాంటి ఎండమావుల్లో కాసుల గలగల కోసం ఎందరో అమాయకులు వెళ్లి బలిఅవుతుంటారు. అలాంటి గల్ఫ్ బాధితుల వెతలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలాంటి బాధలను మనం పంచుకుందాం...అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన కమ్లీ (పేరుమార్చాం)కు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. దీంతో ఆమె భర్త రాములుతో కలిసి కూలీకి వెళ్లేది. అయితే అప్పుడప్పుడు పనుల మీద బళ్లారి, బెంగళూరుకు వెళ్లేది. అయితే భర్త  అనారోగ్యం పాలవ్వడంతో ఉన్న రెండెకరాల భూమిని అమ్మేసి వైద్యం చేయించింది. అంతేకాదు దాదాపు లక్షా పాతికవేల దాకా అప్పు కూడా అయ్యింది. దీంతో చేసేదేమి లేక కమ్లికుమిలిపోయింది. ఈ క్రమంలోనే సీతకు చుట్టుపక్కల వాళ్లు గల్ఫ్ వెళ్లి సంపాదిస్తున్నారని తెలిసింది. దీంతో తాను కూడా అక్కడకు వెళ్లి డబ్బులు సంపాదించాలని ఆశ కలింది. దీంతో వెంటనే తెలిసి ఓ ఏజెంట్ ద్వారా తనకు పని కల్పించాలని  కోరింది. అయితే ఆ ఏజెంట్ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకోసం దాదాపు 70 వేలు ఖర్చు అవుతుందన్నాడు. అంతేకాదు సౌదీలో ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చే వేతనంలో కమీషన్ కూడా అడిగాడు. దీంతో కమ్లి చేసేదేమి లేక తమ ఇంటిని సైతం తాకట్టు పెట్టి అతడికి డబ్బులిచ్చింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఓ ఔట్ సోర్సింగ్ సంస్థ ద్వారా కమ్లీని సౌదీ పంపే ఏర్పాట్లు చేశాడు ఆ బ్రోకర్. సౌదీలో ఓ ఇంట్లో పనిచేయాల్సి ఉంటుందని బ్రోకర్ చెప్పాడు. దీంతో కమ్లీ తన కష్టాలు తీరుతాయని భావించింది.

సౌదీలో మొదట ఓ కంపెనీలో పనిచేయాలని ఔట్ సోర్సింగ్ కంపెనీ తెలిపింది. అక్కడ కమ్లీ హౌస్ కీపింగ్ సర్వీసులో జాయిన్ అయ్యింది. మొదట నెల రోజుల పాటు బాగానే గడిచింది. అయితే ఔట్ సోర్సింగ్ కంపెనీ మరో చోటికి షిఫ్ట్ చేయాలనే పేరిట, ఆమెను ఓ మాన్షన్ హౌస్ లో పని చేయాలని ఆదేశించింది.

ఆ పెద్ద మాన్షన్ హౌస్ లో మొత్తం రెండు మూడు, కుటుంబాలు జీవించేవారు. అందులోని షేక్ కు ముగ్గురు భార్యలు ఉండేవారు. అలాగే మొత్తం 5గురు కుమారులు ఉండేవారు. అయితే ఈ ఇంట్లో పనిచేరి నప్పటి నుంచి కమలీకి కష్టాలు మొదలు అయ్యాయి.

షేక్ కన్ను కమ్లీపై పడింది. తనకు శారీరక సుఖాన్ని ఇవ్వాలని ఆమెకు మొదట బలవంతంగా మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడు. అంతేకాదు ప్రతిసారి కొరడాతో బాదేవాడు. తిండి పెట్టకుండా హింసించాడు. షేక్ తో పాటు అతడి కొడుకులు కూడా కమ్లీని లైంగిక వేధింపులకు గురి చేశారు.

కమ్లీని షేక్ కుమారులు సైతం రేప్ చేసేవారు. దీంతో కమ్లీ ప్రాణాలను అరచేతపట్టుకొని బిక్కు బిక్కు మంటూ బతికింది. రోజుకు 10 నుంచి 15 మంది ఆమెను రేప్ చేసేవారు. అయితే దాదాపు 6 నెలల పాటు నరకం చూసిన కమ్లీ..చివరకు ఓ ఎన్జీవో సహాయంతో భారత్ చేరింది. కాసుల వేటలో గల్ఫ్ వెళ్లడం దండగా అని తమ సన్నిహితులకు చెప్పి భోరుమన్నది.
Published by: Krishna Adithya
First published: December 2, 2020, 10:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading