సోషల్ మీడియా కారణంగా కాపురాల్లో కలహాలు వస్తున్న సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి తమిళనాడులోని వేలూరులో సంచలనంగా మారింది. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడడంతో.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త నిర్ణయించుకున్నాడు. వేలూరుకు చెందిన 30 ఏళ్ల మహిళ కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు ఈ మధ్య టిక్ టాక్‌లో వీడియోలో చేయడం అలవాటుగా మారింది. టిక్ టాక్‌లో కవితలు చెప్పడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం లాంటివి చేస్తుండేది. ఆ వీడియోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపేది.
ఈమె టిక్‌టాక్‌లను గమనించిన వేలూరులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన వివాహమైన 32 సంవత్సరాల వ్యక్తి లైక్ ఇవ్వడం, కామెంట్ పెట్టడం ప్రారంభించాడు. ఐదు నెలల క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఫోన్లో మాట్లాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులను సక్రమంగా పట్టించుకునేది కాదు. భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా టిక్‌టాక్‌కు బానిసైనట్టు గమనించారు.
మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని గమనించాడు. వీటిపై పలు మార్లు భార్యను మందలించినా... ఆమె వినలేదు. దీంతో వేలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించారు. ఆక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే టిక్ టాక్ మోజులో పడి వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వాలని ఆమె భర్త భీష్మించుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.