అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే.. వామ్మో ఎంతపని చేసింది...

పోలీసులు విచారణలో ఆ యువతి వివరాలు రాబట్టారు. బసిరెడ్డి లీలావతి (21) అనే యువతిని అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: August 25, 2019, 2:28 PM IST
అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే.. వామ్మో ఎంతపని చేసింది...
బైక్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 25, 2019, 2:28 PM IST
పోనీలే ఆడపిల్ల కదా.. రోడ్డు మీద ఎండలో నిలబడి ఉందికదా అని ఓ యువకుడు అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే, ఇప్పుడు లిఫ్ట్ ఎందుకు ఇచ్చానురా బాబూ అని తలపట్టుకుంటున్నాడు. కడపకు చెందిన శివ అనే యువకుడు ఈనెల 17న తన అపాచీ బైక్ (ఖరీదు సుమారు రూ.1.25లక్షలు) మీద కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్తున్నాడు. అయితే, మార్గమధ్యంలో ఓ యువతి లిఫ్ట్ కావాలని అడిగింది. నడి రోడ్డు మీద నిలబడిన అమ్మాయి లిఫ్ట్ అడగడంతో పోనీలే పాపం అనుకుని ఆ యువకుడు లిఫ్ట్ ఇచ్చాడు. వారు కొంతదూరం వెళ్లాక అతడికి ఓ ఫోన్ వచ్చింది. దీంతో అతడు బైక్ పక్కన ఆపి.. కొంచెం పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదను చూసుకున్న ఆ యువతి వెంటనే బైక్ వేసుకుని పారిపోయింది. దీంతో ఆ యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసులు విచారణలో ఆ యువతి వివరాలు రాబట్టారు. బసిరెడ్డి లీలావతి (21) అనే యువతి అతడి బైక్‌తో ఉడాయించిందని తేల్చారు. ఆ బైక్ మీద చక్కర్లు కొడుతున్న యువతిని అరెస్ట్ చేశారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...