రోడ్డు గుంతల్లో పడి మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి.. జాబ్‌లో చేరడానికి ముందే...

చక్కగా చదువుకుని, జాబ్‌కు సెలక్ట్ అయిన అమ్మాయి.. ఉద్యోగంలో చేరడానికి ముందు ఇలా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

news18-telugu
Updated: November 5, 2019, 10:14 PM IST
రోడ్డు గుంతల్లో పడి మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి.. జాబ్‌లో చేరడానికి ముందే...
ప్రతీకాత్మక చిత్రం (Image;Twitter)
  • Share this:
రోడ్డు మీద భారీ గుంతులు ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసుకున్నాయి. చక్కగా చదువుకుని కొత్తగా జాబ్ తెచ్చుకుని.. ఆ జాబ్‌లో చేరడానికి ముందే ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సింధూజ అనే యువతి.. తుమకూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ జాబ్‌లో చేరాల్సి ఉంది. దీనికి సంబంధించి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం తన తండ్రితో కలసి బైక్ మీద వెళ్తుండగా చిక్కమంగళూరు - కాదూర్ రోడ్డులో భారీగా రోడ్డు మీద గుంతలు కనిపించాయి. ఆ గుంతల వద్ద బైక్‌ను కంట్రోల్ చేయడానికి సింధూజ తండ్రి బైక్ బ్రేక్‌లు వేశాడు. అయితే, సింధూజ పట్టుతప్పి కింద పడిపోయింది.

తీవ్రగాయాలపాలైన సింధూజను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో హసన్‌లోని మరో పెద్ద ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.

సింధూజ మరణానికి ఆమె తండ్రి కారణమంటూ పోలీసులు కేసుపెట్టడం గమనార్హం. అతివేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు సింధూజ తండ్రి మీద కేసు నమోదు చేశారు. మరోవైపు రోడ్డుమీద గుంతలు తమ అమ్మాయి ప్రాణం తీశాయంటూ బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్కగా చదువుకుని, జాబ్‌కు సెలక్ట్ అయిన అమ్మాయి.. ఉద్యోగంలో చేరడానికి ముందు ఇలా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

కేన్సర్ పేషెంట్ల కోసం గుండుకొట్టించుకున్న యువతి..

Published by: Ashok Kumar Bonepalli
First published: November 5, 2019, 10:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading