Home /News /crime /

WOMAN ENGINEER LOVE AFFAIR WITH TAXI DRIVER AND COMMIT SUICIDE IN KARNATAKA PAH

ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడ్డ యువతి.. కొన్ని రోజులకు తప్పు చేశానంటూ...

టెకీ అనిత (ఫైల్)

టెకీ అనిత (ఫైల్)

Karnataka: ప్రతిరోజు తన కంపెనీకి తీసుకెళ్లే ట్యాక్సీ డ్రైవర్ తో సరదాగా మాట్లాడేది. ఈ క్రమంలో వీరి మధ్య చనువు పెరిగింది. ప్రతిరోజు మాట్లాడుకునే వారు. దీంతో స్నేహం కాస్త పెళ్లి వరకు వెళ్లింది.

కొంత మంది మొదట అబ్బాయిలు లేదా అమ్మాయిలతో తీయగా మాట్లాడతారు. వారే.. తమ జీవితం అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మెల్లగా , తమ వలలో వేసుకుంటారు. అవతలి వారు.. పూర్తిగా నమ్మకం కలిగాక ఆ తర్వాత.. అసలు రంగు బయట పెడతారు. ప్రేమగా మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. తీరా పెళ్లి చేసుకున్నాక.. అప్పటి వరకు దాచుకున్న రంగును బయట పెడతారు. కొందరు.. కట్నం తేవాలని, అందంగా లేవని, మరేదైన వంకతో వేధిస్తుంటారు. కొంత మంది మోజు తీరేవరకు ఉండి.. ఆ తర్వాత.. ముఖం చాటేస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీరిని నమ్మిన వారు... తర్వాత.. నిజస్వరూపం తెలిసి సూసైడ్ లు కూడా చేసుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  దారుణమైన సంఘటన జరిగింది. నెల మంగళ తాలూకాలలో ఈ ఘటన జరిగింది. గంగొండనహళ్లిలో ఉండే, మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిత (25) తన కంపెనీకి తీసుకెళ్లే క్యాబ్ డ్రైవర్ తో ప్రేమలో (love affair)  పడింది. పెద్దలను ఎదిరించి ప్రదీప్ ను పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల పాటు బాగానే ఉన్న.. ఆతర్వాత.. తన అసలు రంగు బయటపెట్టాడు. కొన్నాళ్లకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అనిల్.. కట్నం తేవాలని భార్యను వేధిస్తుండేవాడు. క్రమంగా గొడవలు ఎక్కువయ్యాయి.



ఇటు ఇంట్లో వారికి చెప్పుకోలేక.. అతనితో ఉండలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో.. సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకుంది. తనకు డైవర్స్ కావాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. కేసు పెండింగ్ లో ఉంది. తన జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో ఆమె తర్వాత.. రియలైజ్ అయ్యింది. తన వాళ్లకు మోహం చూపించలేక.. ఇంట్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. స్థానికులు ఇంట్లో గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భర్త.. అతని తల్లి పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka

తదుపరి వార్తలు