ప్రియుడు ఆడిన నాటకానికి ప్రియురాలు బలి (ప్రతీకాత్మక చిత్రం)
Fake Suicide Story turned tragedy: పెద్దలను ఒప్పించాలనే ప్రయత్నంలో భాగంగా 30 ఏళ్ల యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు కథ అల్లాడు. ఆ స్టోరీని ప్రేయసి తల్లిదండ్రులకు తెలియజేసి వారిని ఒప్పిద్దామనకున్నాడు. అయితే ప్రియుడు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే తప్పుడు వార్తను విని తొందరపాటుతనంతో 24 ఏళ్ల ఓ యువతి బుధవారం ప్రాణాలను తీసుకుంది.
ఇద్దరు ప్రేమించుకోవడం (Love) సహజమే.. అందుకు పెద్దవారు ఒప్పుకోకపోతే పారిపోయి (Elope) పెళ్లి (Marriage) చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ బెంగళూరులో (Bengaluru) జరిగిన ఈ నిజ జీవిత ప్రేమకథ (Love Story) మాత్రం ఇందుకు భిన్నం. పెద్దలను ఒప్పించాలనే ప్రయత్నంలో భాగంగా 30 ఏళ్ల యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు కథ అల్లాడు. ఆ స్టోరీని ప్రేయసి తల్లిదండ్రులకు తెలియజేసి వారిని ఒప్పిద్దామనకున్నాడు. అయితే ప్రియుడు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే తప్పుడు వార్తను విని తొందరపాటుతనంతో 24 ఏళ్ల ఓ యువతి బుధవారం ప్రాణాలను తీసుకుంది. సినీ ఫక్కీలో ప్రేమికుడు అల్లిన ఆత్మహత్య నాటకం తన ప్రేయసి ప్రాణాలనే బలికొంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హసన్ జిల్లాలోని చన్నారాయపట్నానికి చెందిన సాకమ్మ యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అక్కడ తన సహచరుడు అరుణ్‌తో ప్రేమలో పడింది. రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిరువురు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించలేదు. ఇటీవలే అరుణ్ తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించాడు. కానీ సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం అందుకు ససేమిరా అన్నారు.
* ఆత్మహత్య నాటకం..
దీంతో తన ప్రేయసి తల్లిదండ్రులను ఒప్పించేందుకు అరుణ్ ఓ ప్రణాళిక రూపొందించాడు. తన స్నేహితుడైన గోపాల్‌ను పోలీసులా రంగంలోకి దించాడు. సాకమ్మ బావ అయిన ప్రజ్వల్‌కు గోపాల్ పోలీసు మాదిరిగా ఫోన్ చేసి అరుణ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడని నమ్మబలికాడు. సాకమ్మతో అరుణ్ వివాహానికి ఒప్పుకోవాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసు పెడతానని బెదిరించాడు. వెంటనే సాకమ్మను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని ప్రజ్వల్‌కు చెప్పాడు. గోపాల్ చెప్పిన విషయాన్ని ప్రజ్వల్.. సాకమ్మ త్లలి లక్ష్మమ్మకు తెలియజేశాడు. తన కూతురును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు కాకుండా చన్నారాయపట్నానికి వెళ్లాలని ప్రజ్వల్‌కు చెప్పింది లక్ష్మమ్మ.
అనంతరం ప్రజ్వల్, అరుణ్ ఆత్మహత్య విషయాన్ని సాకమ్మకు చెప్పి చన్నారాయపట్నానికి రావాలని సూచించాడు. అయితే ప్రియుడు నిజంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని భావించిన సాకమ్మ మునేశ్వర లేఅవుట్లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అరుణ్‌తో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదని, తను లేకుండా నేను బతకలేనని లేఖలో పేర్కొని ప్రాణాలు వదిలింది. లక్ష్మమ్మ మాత్రం అరుణ్, గోపాల్‌తో చేయించిన ఫేక్ కాల్ వల్లే తన కూతురు బలవణ్మరణానికి పాల్పడిందని, వారిద్దరే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్య నాటకం ఆడినందుకుగాను ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం అరుణ్, గోపాల్‌ను పినాయా పోలీసులు అరెస్టు చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.