హోమ్ /వార్తలు /క్రైమ్ /

లవర్ తో అన్నీ అనుభవించి.. ఆపై అబార్షన్ చేయించి.. మరో పెళ్లికి సిద్దమవుతుండగా..

లవర్ తో అన్నీ అనుభవించి.. ఆపై అబార్షన్ చేయించి.. మరో పెళ్లికి సిద్దమవుతుండగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి కూడా చేసుకుంటానని చెప్తున్నాడని నమ్మి తన సర్వస్వాన్ని ధారబోసిందా యువతి. అతడితో పడక కూడా పంచుకుంది. ఇప్పుడామెకు ఐదో నెల. కానీ ఆ దుండగుడిలోని మృగం బయటకు లేచింది..

 • News18
 • Last Updated :

  ప్రేమించాడు.. నీతోనే జీవితం అన్నాడు. నూవ్ లేక నేను లేను అంటూ నమ్మబలికాడు. ఎంతమంది ఎదురైనా సరే.. నిన్ను వదలబోనని.. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇదంతా నిజమేనేమో అనుకుని పాపం ఆ యువతి నమ్మింది. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్తున్నాడని తన సర్వస్వాన్ని ధారబోసింది. అతడితో పడక కూడా పంచుకుంది. ఇప్పుడామెకు ఐదో నెల. కానీ ఆ దుండగుడిలోని మృగం బయటకు లేచింది. పెళ్లి కుదరదన్నాడు. ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఈ విషయం రచ్చకీడుస్తా అని బెదిరించింది. నీ ఇష్టమున్న చోట చెప్పుకోపో అంటూ ఆమెతో అబార్షన్ మాత్రలు మింగించాడు. చివరికి ఏమైందంటే...

  ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. మీరట్ కు చెందిన రాహుల్.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆ యువతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ అమ్మాయి రాహుల్ ను నమ్మింది. పెళ్లి కూడా చేసుకుంటాననడంతో ఆ యువతి లొంగిపోయింది. పలుమార్లు అతడితో పడక కూడా పంచుకోవడంతో ఆమె గర్భవతి అయింది.

  ఇది కూడా చదవండి.. బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా.. బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లి..

  పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా.. రాహుల్ మాత్రం రేపు మాపు.. అని దాటవేసేవాడు.  ఒకరోజు అసలు విషయం చెప్పేశాడు. తాను పెళ్లి చేసుకోనని.. దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. గర్భం తీసుకోవాలని.. లేదంటే చంపేస్తానని హెచ్చరించాడు. ఇదే క్రమంలో మరో పెళ్లికి కూడా సిద్దమయ్యాడు.

  ఇది కూడా చదవండి.. Gang Rape: భర్త చూస్తుండగానే... మహిళపై 17 మంది గ్యాంగ్ రేప్

  ఐదు నెలల గర్భవతి అయిన ఆ యువతికి గర్భస్రావం మాత్రలు ఇచ్చి.. అవి వేసుకోవాలని సూచించాడు. తాను వేసుకోనంటే.. ఆమెపై దాడి చేసి ఆ మాత్రలు మింగించాడు. ఏం కాదులే అనుకుని అక్కడ్నుంచి వెళ్లి పెళ్లికి సిద్దమయ్యాడు. కానీ ఆ యువతి పరిస్థితి విషమించింది. ఈ దారుణాన్ని తట్టుకోలేక ఆమె మానసిక వ్యధకు గురైంది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. మంగళవారం కన్నుమూసింది.

  బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాహుల్ ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు వెళ్లే సరికి రాహుల్ పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నాడు. వారిని చూడంగానే రాహుల్ కు చెమటలు పట్టాయి. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ యువతి మరణ వార్త చెప్పి అతడిని అరెస్టు చేశారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, Love affair, Love cheating, Suicide, Up news, Uttarpradesh

  ఉత్తమ కథలు