WOMAN DIES OF COVID 19 THREE CHILDRENS BECOMING ORPHANS IN ADILABAD VB
Telangana: ఆ కుబుంబాన్ని కబలించిన మాయదారి రోగాలు.. క్యాన్సర్ తో తండ్రి.. కరోనాతో తల్లి.. అనాథలుగా మారిన పిల్లలు
ప్రతీకాత్మక చిత్రం
Adilabad: మాయదారి కరోనా ఆ కుటుంబాన్ని చిన్నాబిన్నం చేసింది. ముగ్గురు పిల్లలను అనాథలుగా మార్చింది. ఏడేళ్ల క్రితం వారి తండ్రి క్యాన్సర్ తో , ఇప్పుడు తల్లి కరోనాతో మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఆ ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఏడేళ్ల క్రితం క్యాన్సర్ తో చిన్నారుల తండ్రి మరణించాడు. అప్పటి నుంచి వారిని తల్లి ఆలనా పాలన చూసుకుంటూ పెంచి పోషించింది. మగబిడ్డను జన్మనిచ్చిన రెండు నెలలకే భర్త మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె జీవనం సాగించింది. అప్పుడు క్యాన్సర్ తో కుబుంబ పెద్ద ను కోల్పోయారు. కరోనా సెకండ్ వేవ్ తో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా బారిన పడ్డ తల్లి ఇటీవల మరణించింది. దీంతో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. తండ్రి మరణంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి తల్లి మరణంతో నా అనే వారు లేకుండా పోయారు. ఈ మాయదారి రోగాలు వారి కుటుంబాన్ని కబలించింది. దినికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి . ఆదిలామాద్ జిల్లాలో ఇచ్చోడ మండలం సాత్నెంబర్ గ్రామానికి చెందిన రాఠోడ్ ఇందల్, గౌరి(32) భార్యభర్తలు. వీరికి వందన(10), చందన(9), సిద్ధు(7) అనే పిల్లలున్నారు.
కోర్టులో అటెంటర్గా పనిచేసే ఇందల్ ఏడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయాడు. అప్పటి నుంచి ముగ్గురు పిల్లలతో గౌరి ఆ పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. అయితే నాలుగు సంవత్సరాల క్రితం తన భర్త ఉద్యోగం తనకు వచ్చింది. అప్పటినుంచి ఎంతో కొంత కుటుంబానికి భరోసాగా ఆ ఉద్యోగం నిలిచింది. అప్పటినుంచి వచ్చే జీతంలో పిల్లలను పోషిస్తూ.. వారిని బాగా చదివించి బంగారు భవితకు బాటలు వేయాలని కలలు కంటూ వచ్చింది. కానీ ఆమె కలలు నెరవేరలేదు. ఆశలు అడియాశలుగా మారాయి. అయితే ఎందరో ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారి గౌరికి కూడా సోకింది.
ఇటీవల ఆమె కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల రోధనలు విన్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.