రెండో భర్తతో విడిపోయి దూరంగా ఉంటున్న మహిళ.. అతడు మాత్రం ఆమె ఉంటున్నచోటుకి చేరి దస్తుల్లో దాచిన..

ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు తొలుత ఓ వివాహం జరిగింది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. కూతరు కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత వారి కాపురంలో గొడవలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్తతో విడిపోయిన ఆమె.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

 • Share this:
  ఆమెకు తొలుత ఓ వివాహం జరిగింది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. కూతరు కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత వారి కాపురంలో గొడవలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్తతో విడిపోయిన ఆమె.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తకు, ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే దాదాపు ఏడాది క్రితం ఆమె రెండో భర్తతో కూడా విడిపోయింది. అయితే మహిళ రెండో భర్త మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కూతురితో ఉన్న ఆమెపై బాంబుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మృతిచెందింది. ఈ షాకింగ్ ఘటన మిజోరామ్‌లోని (Mizoram) లంగ్లీ పట్టణంలో(Lunglei town) మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

  వివరాలు.. ట్లాంతియాంఘ్లిమి (Tlangthianghlimi) అనే 61 ఏళ్ల మహిళకు గతంలో వివాహం జరిగింది. ఆమె ఓ కూతరు (40) కూడా ఉంది. అయితే మొదటి భర్త నుంచి విడిపోయిన ఆమె రోహ్మింగ్లియానా (Rohmingliana) వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. అయితే కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్లాంతియాంఘ్లిమి.. రెండో భర్తతో కూడా విడిపోయింది. ఏడాది నుంచి ఆమె తన కూతురితో కలిసి ఉంటుంది.

  Husband and Wife: అతడు బిజినెస్‌మెన్.. ఆనందంగా సాగిపోతున్న జీవితం.. కానీ ఇలా ఊహించని విధంగా...

  అయితే ట్లాంతియాంఘ్లిమి చేసిన పని రోహ్మింగ్లియానాకు నచ్చలేదు. అసలే కోపిష్టి అయిన అతడు.. తనకు నచ్చని పని చేసిన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. చివరకు లుంగ్లీ జిల్లాలోని హై-పవర్ కమిటీ కార్యాలయం ముందు ట్లాంతియాంఘ్లిమి.. తన కూతురుతో కలిసి కూరగాయలు విక్రయిస్తుంది. అది తెలుసుకున్న రోహ్మింగ్లియానా మంగళవారం మధ్యాహ్నం సమయంలో అక్కడికి చేరుకున్నాడు. ట్లాంతియాంఘ్లిమి పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడాడు. అనంతరం సిగరెట్ వెలిగించి.. అనంతరం బాంబ్‌కు అంటించాడు. తర్వాత ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. బాంబు పేలుడుకు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని లుంగ్లీ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వారు మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. అయితే అదృష్టవశాత్తు.. మహిళ కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది.

  Hyderabad: ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులకు వివాహేతర సంబంధం.. బయటపడ్డ అసలు విషయం.. చివరకు ఇలా..

  ఇక, ఆత్మహుతి దాడిలో జెలటిన్ ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. దానిని అతడు దుస్తుల లోపల దాచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రోహ్మింగ్లియానా సిగరెట్ వెలిగించిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: