విషాదం.. నిద్రిస్తున్నవారిపై కూలిపడిన స్లాబ్ పెచ్చులు..

గత రాత్రి పిల్లలతో సహా దంపతులు మొదటి అంతస్థులోని అద్దె ఇంటిలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో భార్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి.

news18-telugu
Updated: June 25, 2020, 2:42 PM IST
విషాదం.. నిద్రిస్తున్నవారిపై కూలిపడిన స్లాబ్ పెచ్చులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ కుటుంబం మొదటి అంతస్థులో గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా వారిపై స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో ఒక్కరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొ ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నాగశ్వేరరావు కుటుంబం ఓ ఇంటిలో మొదటి అంతస్థులో అద్దెకు ఉంటున్నాడు. నాగేశ్వరరావు నీరుపాద శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మీ, సాయిచంద్, సూర్యాతేజలు ఇద్దరు కొడుకులు. అయితే గత రాత్రి పిల్లలతో సహా దంపతులు మొదటి అంతస్థులోని అద్దె ఇంటిలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో భార్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి.

కాగా, భర్త నాగేశ్వరరావు, సాయిచంద్, సూర్యాతేజ గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో లక్ష్మి చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: June 25, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading