హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహిళ నోట్లో పేలుడు...పొగలు, మంటలు రావడంతో...

మహిళ నోట్లో పేలుడు...పొగలు, మంటలు రావడంతో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైద్య చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని వైద్యులు తెలిపారు. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలను పదే పదే పరిశీలించామని వెల్లడించారు. పేలుడుకు స్పష్టమైన కారణం ఏమై ఉంటుందున్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని స్పష్టంచేశారు.

ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స పొందుతున్న ఓ మహిళ నోట్లో  పేలుడు సంభవించింది. నోటి నుంచి మంటలు, పొగలు రావడంతో డాక్టర్లు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆ షాక్ నుంచి తెరుకునే లోపే ఆ మహిళ కన్నుమూసింది. పేలుడు దృశ్యాలు ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని సీీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. యూపీలోని అలీగఢ్ జేఎన్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇలా జరగడం వైద్య చరిత్రలోనే తొలిసారి కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

బుధవారం  షీలా దేవి అనే మహిళ విషం తాగడంతో ఆమె బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించి చికిత్స ప్రారంభించారు. ఆమె కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసేందుకు  చిన్న పైపును  నోటి నుంచి లోపలికి పంపించారు. అంతలోనే ఆమె నోట్లో   పేలుడు జరిగి మంటలు, పొగలు వ్యాపించాయి. అనంతరం ఆ మహిళ మరణించింది. మహిళ నోట్లో  పేలుడు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది ఎలా సాధ్యమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై డాక్టర్లు వివరణ ఇచ్చారు.

షీలా దేవి  సెల్ఫాస్ టాబ్లెట్ (అల్యూమినియం ఫాస్పేట్) టాబ్లెట్లను నీటిలో కలుపుకొని తాగారు. దాని వలన కడుపులో ఫాస్పిీన్ గ్యాస్‌, అల్యూమినియం ఆక్సైడ్ విడుదలయ్యాయి. మరికొన్ని పేలే గుణమున్న వాయువులు సైతం వెలువడ్డాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్‌తో కలవడం వలన పేలుడు సంభవించింది.
ఎస్ ఎస్ జైదీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్,JNMC

వైద్య చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని వైద్యులు తెలిపారు. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలను పదే పదే పరిశీలించామని వెల్లడించారు. పేలుడుకు స్పష్టమైన కారణం ఏమై ఉంటుందున్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని స్పష్టంచేశారు. తదుపరి పరీక్షల కోసం  షీలా దేవి  మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: BLAST, Crime, Health, Uttar pradesh

ఉత్తమ కథలు