వివాహేతర సంబంధానికి నిరాకరించిన మహిళపై ప్రియుడి దాడి

వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళపై ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా దాడి చేశాడు.


Updated: June 28, 2019, 7:31 PM IST
వివాహేతర సంబంధానికి నిరాకరించిన మహిళపై ప్రియుడి దాడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు... ఆమె పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. దక్షిణ ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వృత్తిరీత్యా బ్యూటీషియన్‌గా పని చేస్తున్న 24 ఏళ్ల మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు సన్నీ అనే యువకుడు. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో... ప్రియుడిని దూరం పెట్టింది ఆ మహిళ. అంతే... ఆమెపై కోపం పెంచుకున్న సన్నీ.. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను బెదిరించేందుకు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో... ఆమె చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. అయితే నిందితుడు సన్నీపై కూడా కత్తి గాయాలు ఉండటంతో... ఈ ఘటనలో మూడో వ్యక్తి ప్రమేయం ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో బాధితురాలు ఒక్కరే ఇంట్లో ఉన్నారని భావించినా... సన్నీ కూడా గాయపడటంతో మూడో వ్యక్తి ప్రమేయంపై కూడా విచారణ చేపట్టారు.

First published: June 28, 2019, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading