స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రమాదం.. మహిళ మృతి

ప్రతీకాత్మక చిత్రం

తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న భవనం పెచ్చులు ఊడిన ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

 • Share this:
  తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న భవనం పెచ్చులు ఊడిన ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్, మొదటి అంతస్థును కరోనా వార్డుగా ఉపయోగిస్తున్నారు. పైన మూడంతస్థుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న బిల్డిండ్ పెచ్చులు పడి.. విధి నిర్వణలో ఉన్న మహిళపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే రాధికను అంబులెన్స్‌లో స్విమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.

  ఇంకా ఈ ఘటనలో కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలోకి వస్తున్న ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఘటన స్థలానికి చేరుకుని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి కరోనా వార్డులోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.

  మరోవైపు ప్రమాద స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పెచ్చులు ఊడిపడిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని అక్కడున్నవారు చెబుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: