Home /News /crime /

WOMAN DIED 82 MAULED BY HER PET PIT BULL IN LUCKNOW PAH

Shocking: యజమానిపై తిరగబడిన పిట్ బుల్ కుక్క.. శరీరాన్ని చీల్చి..

దాడిచేసిన పిట్ బుల్ కుక్క

దాడిచేసిన పిట్ బుల్ కుక్క

Lucknow: వృద్ధురాలు తన ఇంట్లో అరుదైన జాతి కుక్కను పెంచుకుంటుంది. ఈ క్రమంలో అది తన యజమాని పైనే తిరగబడింది. కింద పడేసి పదునైన పళ్లతో కరిచి గాయపర్చింది.

చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వీటిని తమ ఇళ్లలో మనుషుల్లాగా ట్రీట్ చేస్తారు. సవరేట్ ఫుడ్ కూడా పెడుతుంటారు. ఒక్క నిముషం కూడా తమ పెంపుడు జంతువులను వదిలి పెట్టి ఉండరు. జంతువులు కూడా తమ యజమాని పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. తమ ఓనర్ వెంటే ఉంటాయి. కుక్కలు, పిల్లులైతే.. తోక ఊపుకుంటూ.. తిరుగుతుంటాయి. అయితే, కొన్ని సార్లు.. కుక్కలు, పిల్లులు.. వింతగా ప్రవర్తిస్తుంటాయి. తమ ఇంటి వారిపైనే దాడిచేయడం, కరిచి గాయపర్చడం చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు అరుదుగా చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఖైసర్ బాగ్ లో 82 ఏళ్ల సుశీలా త్రిపాఠి తన ఇంట్లో అరుదైన కుక్క పిట్ బుల్ ను (Pet dog)  పెంచుకుంటుంది. ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్. అయితే, మంగళవారం.. ఆమె తన ఇంట్లో పైకప్పు మీదకి ఎక్కింది. ఇంతలో ఏమైందో ఏమో.. అక్కడికి పిట్ బుల్ కుక్క వెళ్లింది. అది.. వృద్ధురాలిని ఇష్టమోచ్చినట్లు గాయపరిచింది. అయితే.. కాసేటికి రక్తపు మడుగులో ఉన్న సుశీలాను పనివాళ్లు గమనించారు.



వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేశారు. కాగా, పిట్ బుల్ (Pit bull dog) అనేది అరుదైన జాతి కుక్కగా పోలీసులు తెలిపారు. దాన్ని ఇంట్లో పెంచుకొవడానికి ప్రత్యేక మైన లైసెన్స్ కల్గి ఉండాలని, దీన్ని యూఎస్ లో ప్రత్యేక పోలీసులు ఉపయోగిస్తారని తెలిపారు. 1991 లో యూఎస్ చట్టం ప్రకారం.. పొట్టి జుట్టు పిట్ బుల్ కుక్క.. దీనిని శిక్షణ లేని వ్యక్తులు ఇంటి పెంపుడు జంతువుగా ఉంచడం చాలా క్రూరంగా పరిగణించబడుతుంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఈతకు వెళ్లిన ఒక బాలుడిని మొసలి మింగేసింది.

మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh) షియో పూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. చంబల్ నదిలో కొంత మంది పిల్లలు స్నానానికి వెళ్లారు. నీటిలో సరదాగా ఈతకొడుతున్నారు. ఇంతలో ఒక మొసలి బాలుడిని కాళ్లను పట్టుకుంది. వెంటనే నీళ్లలోనికి లాక్కెళ్లింది. చుట్టుపక్కల పిల్లలు.. భయంతో పారిపోయారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కొంత మంది పడవలతో నీళ్లలోనికి వెళ్లారు. మొసలిని వలలో వేసి బంధించారు. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత.. దాని నోటి మధ్యలో ఒక కర్రను ఇరికించారు.

మొసలి నమల కుండా చేశారు. ఈ క్రమంలో.. తమ కొడుకును మరల మొసలి ఉమ్మివేసేలా ప్రయత్నించారు. ఏడు గంటల పాటు మొసలికి చుక్కలు చూపించారు. ఆ తర్వాత.. అక్కడ అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన స్థానికులను సముదాయించారు. మొసలి మింగివేసిన, అనంతరం.. బాలుడు సజీవంగా ఉండడని అన్నారు. ఆ తర్వాత.. మొసలిని వేరే చోట వదిలేశారు. కాగా, మొసలి నోటికి చిక్కిన బాలుడు అంతర్ సింగ్ గా, అతనికి ఏడేళ్లని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Dog, Pet dog, Uttar pradesh

తదుపరి వార్తలు