బ్యాంకులో పనిచేస్తున్నానంటూ నమ్మించి రూ.11 లక్షలు..

ప్రాంకాబోకే అనే మహిళ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానంటూ ఇండియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావిస్తున్నట్టు లక్ష్మణ్‌రావుతో చాటింగ్ చేసింది.

news18-telugu
Updated: July 9, 2020, 8:34 AM IST
బ్యాంకులో పనిచేస్తున్నానంటూ నమ్మించి రూ.11 లక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తిని బ్యాంకులో పనిచేస్తున్నానంటూ ఓ మహిళ నమ్మించింది. ఆ పేరుతో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంది. తాను పనిచేసే బ్యాంకులో చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు డ్రా చేసేందుకు సహకరించాలని కోరింది. అందుకు అంగీకరించిన వ్యక్తి.. సదరు మహిళను నమ్మి రూ.11 లక్షలు ఆన్‌లైన్‌లో పంపి మోసపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌రావు బైండ్ల పూజారిగా పనిచేస్తున్నాడు. జనవరి నెలలో మెసెంజర్ ద్వారా తమరా బెన్‌సెట్టి అనే మహిళ పరిచయం అయ్యింది. తాను లండన్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నానంటూ మెసెజ్‌లు చేస్తూ పరిచయం పెంచుకుంది. లక్ష్మణ్‌రావు సైతం ఆమెతో చాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఆ మహిళ అతడి వ్యక్తిగత విషయాలను తెలుసుకుంది.

ఒక రోజు తాను పనిచేసే బ్యాంకులోతెలిసిన వ్యక్తి చనిపోయాడని, అతడి బ్యాంకు ఖాతాలోని 9600 మిలియన్‌ డాలర్లును డ్రా చేసుకునేందుకు సహకరించాలని లక్ష్మణ్‌రావును కోరింది. ఇది నమ్మిన లక్ష్మణ్‌రావు ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు. అనంతరం మృతుడి ఖాతాలోని నగదును డ్రా చేసుకునేందుకు అక్కడి బ్యాంకులో లక్ష్మణ్‌రావు పేరుమీద ఖాతా తెరవాలని చెప్పింది. అందుకు రూ.96 వేలు అవసరమని తీసుకుంది. ఇలా పలు విడతల్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆ మహిళ లక్ష్మణ్‌రావు నుంచి దాదాపు రూ.8 లక్షలు తన ఖాతాలో వేయించుకుంది.

ఇదిలావుంటే.. గత మార్చి 20న ప్రాంకాబోకే అనే మహిళ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానంటూ ఇండియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావిస్తున్నట్టు లక్ష్మణ్‌రావుతో చాటింగ్ చేసింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌రావు తనకు రూ.5 లక్షలు అవసరం ఉన్నాయంటూ ఆ మహిళకు చెప్పాడు. అయితే ఆ మహిళ ఆ డబ్బును తాను పంపిస్తానని, బ్యాంకు ఖాతా ద్వారా పంపితే ఇబ్బందులు వస్తాయని, కొరియర్ ద్వారా పంపిస్తానని చెప్పింది. అందుకు సంబంధించిన కస్టమ్స్ ఛార్జీలు చెల్లించి తీసుకోమ్మని సూచించింది. ఆ తర్వాతి రోజే కవితాశర్మ అనే మహిళ పేరుతో ఢిల్లీ ఎయిరుపోర్టు పార్శిల్ సెక్షన్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పింది.

మీకు పార్శిల్ వచ్చిందని, సర్వీస్ చార్జీల కింద రూ.40,600 తమ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ పార్శిల్‌ను ఇంటి అడ్రస్‌కు పంపిస్తానని లక్ష్మణ్‌రావుకు చెప్పింది. అది నమ్మిన లక్ష్మణ్‌రావు డబ్బులను ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలోకి పంపించాడు. అయినా ఆ పార్శిల్ అతడికి అందలేదు. దీంతో లక్ష్మణ్ రావు కవితాశర్మకు కాల్ చేశాడు. పార్శిల్ ఇంకా రాలేదని అడగ్గా, అందులో విలువైన ఆభరణాలు ఉన్నాయని, మరో రూ.3,13,600 పంపిస్తేనే పార్శిల్ పంపుతామని, లేకపోతే అది ప్రభుత్వానికి అందిస్తామని చెప్పింది.

దీంతో ఆ మహిళ చెప్పిన నగదును ఆమె బ్యాంకు ఖాతాలోకి పంపించాడు. ఎన్నిరోజులు గడిచినా పార్శిల్ రాకపోవడంతో మరోసారి కవితాశర్మకు కాల్ చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. మొత్తంగా లక్ష్మణ్‌రావు ఆన్‌లైన్ ద్వారా రూ.11 లక్షలు మోసపోయానని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading