Hyderbad:హైదరాబాద్ శివార్లలో దారుణం.. రైల్వే ట్రాక్‌ సమీపంలో మహిళ డెడ్ బాడీ

ప్రతీకాత్మక చిత్రం (credit - twitter)

హైదరాబాద్ నగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా మృతదేహం లభ్యమైంది.

  • Share this:
    హైదరాబాద్ నగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. అంకుషాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో కుళ్ళిపోయిన స్థితి లో మహిళా డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. కుళ్లిన స్థితిలో మహిళా మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల క్రితం మహిళ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అందువల్లే మృతదేహం కుళ్లి పోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మహిళను గుర్తు పట్టకుండా ఉండేందుకు మొహం తగలబెట్టారని పోలీసులు తెలిపారు. చనిపోయిన మహిళ వయసు 35 నుంచి 40సంవత్సరాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చనిపోయిన మహిళ ఎవరనే వివరాలు సేకరిస్తున్నారు.

    ప్రమాదం జరిగిన స్థలంలోని ఆధారాలను క్లూస్ టీమ్ సేకరిస్తుందని పోలీసులు తెలిపారు. మహిళపై రేప్ చేసి చంపారా లేదా ? మరేదైనా కారణంతో చంపారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇంకా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published: