గుంటూరు జిల్లాలో ఘోరం...ప్రేమ జంటపై దాడిలో యువతి మృతి

యువతీయువకుడు రక్తపు మడగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.

Shiva Kumar Addula | news18-telugu
Updated: February 12, 2019, 8:37 AM IST
గుంటూరు జిల్లాలో ఘోరం...ప్రేమ జంటపై దాడిలో యువతి మృతి
నమూనా చిత్రం
Shiva Kumar Addula | news18-telugu
Updated: February 12, 2019, 8:37 AM IST
గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. నవులూరులో ఓ ప్రేమజంటపై నలుగురు యువకులు దాడి చేశారు. ప్రియుడిని తీవ్రంగా గాయపరిచి.. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పట్ల పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమెకు రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స చెందుతూ యువతి మృతిచెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

యువతి తలపై తీవ్రగాయాలు కావడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రియుడు శ్రీనివాస్‌ను విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరితో పాటు.. బంధువులు, స్నేహితుల్ని కూడా పోలీసులు విచారించే పనిలో పడ్డారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

నవులూరు స్టేడియ సమీపంలో ఈ ఘటన జరిగింది. మొదట ప్రియుడిపై దాడి చేసిన దుండగులు..యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ప్రియుడికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడు కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. కళ్లెదుటే ప్రియురాలిపై అఘాయిత్యం జరుగుతున్నా కాపాడలేకపోయాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. యువతీయువకుడు రక్తపు మడగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5గంటల తర్వాత ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి కలుసుకున్నారు. దీంతో అక్కడకు  చేరుకున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...