news18-telugu
Updated: July 16, 2020, 2:59 PM IST
ప్రతీకాత్మక చిత్రం
యూపీలో కాస్గంజ్లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుళ్లు మార్కెట్ నుంచి వస్తుండగా వెనక నుంచి ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. మొదటి అది రోడ్డు ప్రమాదం అని అనుకున్నారు. కానీ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో షాకింగ్ విషయం బయపడింది. అది రోడ్డు ప్రమాదం కాదని.. హత్యని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లీకూతుళ్లను చంపిన వ్యక్తులు తమకు తెలుసని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం తన కూతురిపై రేప్ చేశాడని.. వారిపై కేసుపెట్టినందుకు కక్షగట్టారని వివరించారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
అసలేం జరిగిదంటే..
శాంతి దేవి (50), బాదన్ సింగ్ దంపతులు కాస్గంజ్లో నివసిస్తున్నారు. వీరికి కూతురు సుష్మ (17) ఉంది. వీరి పొరుగింట్లో యశ్ వీర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. బాదన్ సింగ్ ఫ్యామిలీలో కలివిడిగా ఉండేవాడు. ఐతే నాలుగేళ్ల క్రితం పొరుగింట్లో ఉండే యశ్వీర్ అనే వ్యక్తి ఆ బాలికను రేప్ చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిడ్నాప్ చేసి అత్యారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. అయితే 2017లో బెయిల్‌పై బయటకు వచ్చిన యశ్వీర్.. అప్పటి నుంచి బాదన్ ఫ్యామిలీపై రగిలిపోయేవాడు. తాను జైలుకు వెళ్లడానికి వారే కారణమని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మార్కెట్ నుంచి సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ఘటనలో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు.
బాదన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని, పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. అంతేకాు డబ్బుల విషయంలో యశ్వీర్ తండ్రికి, బాధితురాలి తండ్రికి మధ్య జరిగిన గొడవలో నిందితుడి తండ్రి చనిపోయాడని తెలిపారు. దీంతో ఆ కేసులో బాదన్ సింగ్‌ను అరెస్ట్ చేశామని.. అతడిని 2018లో అతడు జైలు నుంచి విడుదలైనట్లు చెప్పారు. ఈ క్రమంలోనే బాదన్ సింగ్ ఫ్యామిలీపై పగ పెంచుకున్న యశ్ వీర్.. అతడి భార్య, కూతురిని డాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
July 16, 2020, 2:59 PM IST