అర్ధరాత్రి ఇంట్లోకి దూరి అత్యాచారం చేయబోతే.. కొడవలితో అతడి మర్మాంగాలను కోసేసింది..!

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టబోయాడు. ఒంటరిగా తన కుమారుడితో కలిసి నిద్రపోతుండగా ఓ మహిళ ఇంట్లోకి అతడు దూరాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. ఆమె వెంటనే తేరుకుని..

 • Share this:
  అర్ధరాత్రి. ఇంట్లో తన కుమారుడితో కలిసి నిద్రపోతోందో మహిళ. ఆమె ఒంటరిగా ఉందని తెలిసి ఆ ఇంట్లోకి చొరబడ్డాడో వ్యక్తి. ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అత్యాచారానికి పాల్పడబోయాడు. నిద్రమత్తులో ఉన్న ఆమె ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురయింది. అయినప్పటికీ వెంటనే తేరుకుని అతడిని ఎదురిచింది. ఇంట్లోంచి అతడిని బయటకు గెంటేయాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉన్న కొడవలితో దాడి చేసింది. ఈ దాడిలో అతడి మర్మాంగాలను కోసేసింది. దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె అంత రాత్రిలోనూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు పెట్టింది. అయితే అదే సమయంలో అతడు కూడా ఆమెపై కేసు పెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలోని ఉమరిహా గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఓ మహిళ తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆమె ఇంట్లోకి దూరాడు. మొదట అతడు దొంగేమో అని భావించారు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె కొడుకు ప్రయత్నించాడు. ఎలాగోలా ఇంట్లోంచి బయటకు పారిపోయాడు. అయితే ఆమె మాత్రం ఇంట్లోనే ఇరుక్కుపోయింది. అయినప్పటికీ అతడికి భయపడకుండా ఎదురుతిరిగింది. అతడిని బయటకు పంపేందుకు పోరాడింది. అయితే అతడు మాత్రం ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
  ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

  అతడి దుర్మార్గాన్ని గ్రహించిన ఆమె ఇంట్లో ఉన్న కొడవలితో అతడిపై దాడి చేసింది. అతడి మర్మాంగాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు బయటకు పరుగులు తీశాడు. ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అతడిపై కేసు పెట్టింది. అయితే ఆ మర్నాడే అతడు కూడా ఆమెపై కేసు పెట్టాడు. తనపై దాడి జరిగిందనీ, తీవ్ర గాయాల పాలయ్యానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారనీ, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..
  Published by:Hasaan Kandula
  First published: