సీఐ నుంచి ప్రాణహాని, లైంగిక వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆందోళన

కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఉసేనమ్మ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ఆత్మకూరు సీఐ గుణశేఖర్ లైంగికంగా వేధించాడని ఈనెల 15న జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: July 17, 2020, 3:26 PM IST
సీఐ నుంచి ప్రాణహాని, లైంగిక వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆందోళన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన పైఅధికారి నుంచి లైంగిక వేధింపులు, ఆ తరువాత బెదిరింపులు ఎక్కువకావడంతో మహిళా కానిస్టేబుల్ భరించలేకపోయింది. సదరు అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె ఆందోళన బాట పట్టింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఉసేనమ్మ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తనను ఆత్మకూరు సీఐ గుణశేఖర్ లైంగికంగా వేధించాడని ఈనెల 15న జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది.

అయితే ఆ కేసు విచారణలో ఉండగా సీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఉసేనమ్మ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. సీఐ నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు తాను తన కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్నానని.. ఇదే అదనుగా భావించి సీఐ గుణశేఖర్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. తన వద్ద అనేకసార్లు డబ్బు కూడా తీసుకున్నారని పేర్కొంది. దీనిపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని... ఆ కేసు విచారణలో ఉండగా సీఐ తనను బెదిరించడం మొదలుపెట్టాడని ఆందోళన వ్యక్తం చేసింది. తనను, తన నా కుమారుడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నానని విజ్ఞప్తి చేసింది.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading