Home /News /crime /

WOMAN CONSTABLE FROM ASSAM GET CHEATED BY CYBER FRAUD AND LOST 60 LAKH RUPEES CONVICT ARRESTED AK

OMG: ఆమె ఓ మహిళా కానిస్టేబుల్.. కానీ అన్నీ మర్చిపోయింది.. అలా బాధితురాలిగా మారిపోయింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: తాను ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో నివసిస్తున్నానని బిజినెస్‌ వీసాపై భారత్‌కు వచ్చానని అతడు మహిళలను నమ్మించాడు.

    నోయిడా అస్సాం రైఫిల్స్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ను పెళ్లి సాకుతో రూ.60 లక్షలు మోసం చేశాడు ఓ నైజీరియన్ దేశస్థుడు. నోయిడాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. అస్సాం రైఫిల్స్‌లో పోస్ట్ చేయబడిన ఒక మహిళా కానిస్టేబుల్ తాను మ్యాట్రిమోనియల్ సైట్‌లో పెళ్లి కోసం ప్రొఫైల్‌ను రూపొందించినట్లు సెక్టార్ 36లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌లోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రొఫెసర్ త్రివేణి సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి భారత సంతతికి చెందిన కెనడా పౌరుడిగా నటిస్తూ ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టినట్టు వివరించాడు.

    ఆ తరువాత కానిస్టేబుల్‌, యువకుడి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇద్దరూ పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో మూడు నెలల్లో యువకుడు రకరకాల సాకులు చెప్పి మహిళ నుంచి దాదాపు రూ. 60 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రీటా యాదవ్, సబ్-ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ తదితరులు ఈ కేసులో నైజీరియన్ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

    తాను ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో నివసిస్తున్నానని బిజినెస్‌ వీసాపై భారత్‌కు వచ్చానని అతడు మహిళలను నమ్మించాడు. అమ్మాయిల డబ్బును స్వాహా చేయడం పనిగా పెట్టుకున్నాడు. అతడి నుంచి ల్యాప్‌టాప్, ఏడు మొబైల్ ఫోన్లు, వైఫై డాంగిల్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చాలా మంది అమ్మాయిలను తన వలలో బంధించి మోసగించినట్లు విచారణలో పోలీసులకు తెలిసింది.

    Liquor Loot : హైవేపై భయానక కారు ప్రమాదం.. అందులోని మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం..

    Shocking: సూసైడ్ చేసుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి.. కారణం ఏంటంటే..

    పెళ్లి పేరుతో 100 మందికి పైగా మహిళలను మోసం చేసిన వ్యక్తిని గతంలో ఢిల్లీ అరెస్టు చేశారు. 35 ఏళ్ల నిందితుడు దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మహిళలను మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలను లాక్కున్నాడు. అరెస్టు చేసిన వ్యక్తిని ఫర్హాన్ తసీర్ ఖాన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు ఫిర్యాదు మేరకు మార్చిలో ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందిన ఫర్హాన్‌ను ఢిల్లీలోని పహర్‌గంజ్ నుంచి అరెస్టు చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Women constables

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు