హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana:తోడు కావాలంటూ వేధింపులు..తెరపైకి నారాయణపేట్‌ డీసీసీ ప్రెసిడెంట్ లవ్ డ్రామా

Telangana:తోడు కావాలంటూ వేధింపులు..తెరపైకి నారాయణపేట్‌ డీసీసీ ప్రెసిడెంట్ లవ్ డ్రామా

(డీసీసీ ప్రెసిడెంట్‌ మోసం)

(డీసీసీ ప్రెసిడెంట్‌ మోసం)

Narayanpet:కొందరు నేతలు ఓట్లు, పదవుల కోసం ప్రజలకు తప్పుడు హామీలు, వాగ్దానాలు ఇస్తారని తెలుసు. కాని పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోసం చేశాడు. శారీరక సుఖం తీర్చుకొని మోసం చేయడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

ఇంకా చదవండి ...

రాజకీయ నేతల్లో కొందరు తమ పదవులు, ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకే తప్పుడు హామీలు, వాగ్దానాలు ఇస్తారని తెలుసు. కాని పార్టీకి చెందిన కార్యకర్త, కార్యక్రమాల పేరుతో తరచూ తనని కలుస్తున్న ఓ మహిళా నాయకురాలికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మాయ మాటలు చెప్పి తన పబ్బం గడుపుకోవడం వార్తల్లోకి వచ్చింది. నారాయణపేట్‌(Narayanpet) జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు(District Congress President)కుంభం శివకుమార్‌రెడ్డి(Kumbham Sivakumarreddy)జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ మహిళను అత్యంత తెలివిగా లోబర్చుకున్నాడు. కనికట్టు చేసే వాళ్లు, కట్టుకథలు అల్లేవాళ్లు కూడా చెప్పలేని మాటలను చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని స్వయంగా బాధితురాలే(victim women) పోలీసుల్ని ఆశ్రయించింది. నారాయణపేట్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి పార్టీకి చెందిన ఓ నాయకురాలు తరచూ తనను కలిసేందుకు వస్తుండటంతో అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లైన మీరు తనను ప్రేమించడం ఏమిటని బాధితురాలు ప్రశ్నిస్తే తన భార్య త్వరలోనే చనిపోతుందని..అనారోగ్యం కారణంగా ఆమె మూడేళ్ల (3Years)కంటే ఎక్కువ బ్రతకదని నీ తోడు కావాలంటూ సినిమా స్టోరీని వినిపించాడు. బాధితురాలు జిల్లా స్థాయి నేతగా ఉన్న శివకుమార్‌రెడ్డి మాటలు నమ్మింది. అంతే కాదు ఆమెను నమ్మించడానికి ఓ పసువుతాడును మెడలో కట్టి మంగసూత్రంగా మేనెజ్ చేశాడని బాధితురాలు పోలీసు(Police)ల ముందు వాపోయింది. ఇదంతా జరగిన తర్వాత మాట్లాడుకుందాం రా అంటూ హైదరాబాద్‌ Hyderabadపంజాగుట్టా(Panjagutta)లోని ఓ హోటల్‌(Hotel)‌కి పిలిపించి ఆమెపై లైంగికదాడి(Physical abuse)కి పాల్పడ్డాడు. అదే సమయంలో బాధితురాలికి తెలియకుండా ఫోటోలు (Photos) ,వీడియోలు(Videos)తీసి బ్లాక్‌ మెయిల్(Blackmail) చేస్తున్నాడని బాధితురాలు ఆలస్యంగా తెలుసుకుంది.

పెళ్లం చస్తుందని డ్రామా..

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు గత రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్న మహిళా నాయకురాలిని లొంగదీసుకోవడమే కాకుండా హోటల్‌లో గడిపిన ఫోటోలు, వీడియోలు బయటపెడతానంటూ పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతో ..నిజస్వరూపం బయటపెట్టాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే ఇప్పుడు దూరంగా పెట్టడమే కాకుండా తన అనుచరులతో బెదిరిస్తున్నాడని..పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కుంభం శివకుమార్‌రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

పెళ్లితో మహిళపై వేధింపులు..

రాజకీయాల్లో ఉండే ప్రజాప్రతినిధులు ప్రజల్నే కాదు సొంత పార్టీ నేతల్ని కూడా మోసం చేస్తారని తెలుసు. కాని పార్టీకి సేవ చేస్తున్న ఓ మహిళను అందులోనూ పెళ్లి చేసుకుంటానని, భార్య చనిపోతుందనే కట్టుకథలు చెప్పి మోసం చేసిన కుంభం శివకుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First published:

Tags: Crime news, Mahabubnagar

ఉత్తమ కథలు