• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • WOMAN COMMITTED SUICIDE WITH HER TWO DAUGHTERS NK

తీవ్ర విషాదం... రైలు పట్టాలపై తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య

తీవ్ర విషాదం... రైలు పట్టాలపై తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య

తీవ్ర విషాదం... రైలు పట్టాలపై తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య

Andhra Pradesh : ప్రాణం తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మరి ఆ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? వాళ్లకు అంత కష్టం ఏమొచ్చింది?

 • Share this:
  అనంతపురం జిల్లా... నేషనల్ పార్క్ దగ్గర్లో... స్థానికులు రైలు పట్టాలు దాటుతూ... కాస్త దూరంలో ఎవరో మనుషులు పడివున్నట్లు గుర్తించారు. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూశారు. ఓ మహిళ, ఇద్దరు కూతుళ్లు రైలు పట్టాల మధ్యలో శవాలై కనిపించారు. షాకైన స్థానికులు... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పోలీసులు... ప్రాథమిక దర్యాప్తు చెయ్యగా ఆ విషాదానికి అసలు కారణాలు తెలిశాయి. పాపంపేట ప్రాంతానికి చెందిన వెంకటేశ్, పోలేరమ్మ (45) భార్యాభర్తలు. వీళ్లకు ఆర్తి (17), దీప(11) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. కూలిపనులు చేసుకుంటూ ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. పెద్దమ్మాయి ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, నర్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. పిల్లల చదువుల కోసం, ఇతరత్రా ఆర్థిక సమస్యల వల్ల పోలేరమ్మ తన నగలను తాకట్టు పెట్టింది. ఈ విషయం తెలిసిన వెంకటేశ్... భార్యతో గొడవకు దిగాడు. తాకట్టు పెట్టిన నగలను ఎలా విడిపించగలం? ఎక్కడి నుంచీ వస్తాయి డబ్బులు అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో గొడవకు దిగినట్లు తెలిసింది. ఇది వరకు కూడా ఇలా చాలాసార్లు వెంకటేశ్ ఆమెపై మండిపడినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలతో జీవితంపై విరక్తి చెందిన పోలేరమ్మ... రాత్రి 9 గంటలకు కూతుళ్లను తీసుకొని ఇంట్లోంచీ వెళ్లిపోయింది. ఎంతకీ ఆమె తిరిగి రాకపోవడంతో... భర్త, ఇతర బంధువులు వారి కోసం వెతికినా ప్రయోజనం కనిపించలేదు. ఇంట్లోంచీ వెళ్లిపోయిన ఆ ముగ్గురూ... తెల్లారి రైలు పట్టాల మధ్యలో చనిపోయి కనిపించడం అందర్నీ కలచివేసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

  అసలీ సూసైడ్ చేసుకోకుండా ఉండి ఉంటే ఎంతో బాగుండేది. పెద్ద కూతురు నెక్ట్స్ ఇయర్‌లో నర్సింగ్ జాబ్ చేస్తూ... ఎంతో కొంత సంపాదించే ఛాన్స్ ఉండేది. తద్వారా ఆ కుటుంబం ఆర్థిక సమస్యల నుంచీ గట్టెక్కే అవకాశాలు ఉండేవే. ప్రభుత్వం కూడా రకరకాల స్కీమ్స్ తెస్తోంది కాబట్టి... అలాంటి వాటి నుంచీ ప్రయోజనం పొంది... సంసారాన్ని నెట్టుకొచ్చి ఉంటే... ఇప్పుడీ విషాదం జరిగేదే కాదు. పోలేరమ్మ బాధల్లో తీసుకున్న నిర్ణయంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోగా... ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ లోకాన్ని వీడిపోయినట్లైంది.


  రెయిన్‌బో ఫొటోగ్రఫీ... సెలబ్రిటీల పరిచయ వేదిక
  ఇవి కూడా చదవండి :

  భార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... ఫ్యాన్స్ గ్రీటింగ్స్

  సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లు

  Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

  తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన

  పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు