హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hindupur Woman: నెల రోజుల కిందట పెళ్లి.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న నవ వధువు.. అసలేం జరిగిందంటే..?

Hindupur Woman: నెల రోజుల కిందట పెళ్లి.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న నవ వధువు.. అసలేం జరిగిందంటే..?

పల్లవి పెళ్లి ఫొటో

పల్లవి పెళ్లి ఫొటో

ఆ యువతికి నెల రోజుల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టకుంది.

ఆ యువతికి నెల రోజుల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టకుంది. అయితే అలాంటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు.. ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతరపురం జిల్లా (Anantapur district) హిందుపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిందూపురం పట్టణం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్న వెంకటేష్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు హిందూపురంలోనే (Hindupur) వివాహం చేశారు. రెండో కుమార్తె పల్లవి(28) బీఈడీ చదివింది. హిందూపురంలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పినిచేసేంది. ఆమెను పామిడిలో ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునకు ఇచ్చి ఆగస్ట్‌ 27న పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష నగదు, మరో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలు అందజేశారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన పల్లవికి అక్కడ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అదనపు కట్నం (Dowry harassment) తీసుకురావాలని భర్త, అత్తింటివారి వేధింపులకు దిగారు. రోజురోజుకు వేధింపులు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పల్లవి.. పెళ్లి జరిగిన నెల రోజులకే పుట్టింటికి వచ్చేసింది. గత పది రోజులుగా పుట్టింట్లోనే ఉంటుంది.

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. దసరా పండుగ ఆర్టీసీ బస్సుల్లో ఆ చార్జీలు ఎత్తివేత..

అయితే పుట్టింటికి వచ్చిన కూడా పల్లవికి అదనపు కట్నం వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం తీసుకుని రావాలని భర్త ఆమెకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తీవ్ర పల్లవి తీవ్ర మనస్తాపం చెందింది. ఆ వేధింపులు భరించలే.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Wife: ఇద్దరు కూతుళ్లకు పెళ్లిలు చేసింది.. దుబాయ్‌లో భర్త.. యువకుడి మోజులో పడింది.. కట్ చేస్తే..

కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులు పల్లవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భర్త, అత్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మిదేవి, వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ రమ్య, తహసీల్దార్‌ శ్రీనివాసులు, వన్‌టౌన్‌ సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి వెళ్లి నవ వధువు మృతదేహాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

First published:

Tags: Anantapuram, Crime news, Dowry harassment, Suicide

ఉత్తమ కథలు