కలలో కూడా ఊహించలేదు.. కూతురు చేసిన పనికి తల్లి ఆత్మహత్య..

కుమార్తెను డాక్టర్‌గా చూడాలని.. ఆస్తులు అమ్మి మరీ ఆమె చదివిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ.. ఇలా చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది.

news18-telugu
Updated: July 16, 2019, 8:36 AM IST
కలలో కూడా ఊహించలేదు.. కూతురు చేసిన పనికి తల్లి ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెను డాక్టర్‌గా చూడాలని.. ఆస్తులు అమ్మి మరీ ఆమె చదివిస్తోంది. చదువుకుని డాక్టర్ అవుతుందని తప్ప.. ఆమె ఇలా చేస్తుందని కలలో కూడా ఆమె ఊహించలేదు.ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డ.. ఇలా చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లి చావును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రుల పరిస్థితిని కూడా ఆలోచించాలని వారు చెబుతున్నారు. ఇంట్లోవాళ్లకు అర్థమయ్యేలా నచ్చజెప్పి ఒప్పించుకోవాలని అంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు మానుకుని.. ఒక్క క్షణం తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>