ఏపీలో పండగపూట విషాదం... అమ్మఒడి డబ్బుల కోసం ఆత్మహత్య

అమ్మ ఒడి డబ్బుల విషయంలో ఓ కుటుంబంలో వివాదం చోటు చేసుకుంది.

news18-telugu
Updated: January 14, 2020, 3:39 PM IST
ఏపీలో పండగపూట విషాదం... అమ్మఒడి డబ్బుల కోసం ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో భోగీ పండగరోజునే విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామంలో అమ్మ ఒడి డబ్బుల విషయంలో ఓ కుటుంబంలో వివాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం అమ్మ ఒడి డబ్బుల కోసం భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో మాట మాటపెరిగి భార్య ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిలక్ష్మి మృతి చెందింది. పండగపూట ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>