Mahabubabad: ఆషాఢమాసం అని పుట్టింటికి వచ్చిన కూతురు.. ఇలా చేస్తుందని ఊహించని తల్లి..

ప్రతీకాత్మక చిత్రం

ఆషాఢమాసం కావడంతో వారం రోజుల క్రితం రమ్యను సారమ్మ పుట్టింటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం రమ్య మూడు నెలల గర్భిణి.

 • Share this:
  ఓ యువతి తనకు ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోకుండా పెద్దలు పెళ్లి జరిపించారు. ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వచ్చిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ కాలనీకి చెందిన చుక్క సారమ్మ భర్త ఏడాది క్రితం కరోనాతో మృతిచెందాడు. దీంతో కుమార్తె రమ్యకు పెళ్లి చేయాలని భావించింది. డిగ్రీ థర్డ్ ఈయర్ చదువుతున్న రమ్య మాత్రం తాను ఉన్నత చదువులు చదువుతానని తల్లికి చెప్పింది. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని సారమ్మ కూతురితో చెప్పింది. ఇక, ఐదు నెలల క్రితం రమ్యను ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం నెమలిపురి గ్రామానికి చెందిన చీమల వెంకన్నకు ఇచ్చి వివాహం జరిపించారు.

  ఆషాఢమాసం కావడంతో వారం రోజుల క్రితం రమ్యను సారమ్మ పుట్టింటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం రమ్య మూడు నెలల గర్భిణి. సారమ్మ రేషన్ డీలర్ కావడంతో.. బియ్యం పంపిణీ చేసేందుకు వెళ్లింది. ఇక, ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చిన రమ్య.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

  చదవండి: 15 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతికి పెళ్లి.. సీక్రెట్‌గా ఉంచిన ఇరు కుటుంబాలు.. ఎలా బయటపడిందంటే..

  Rain Alert: రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

  కొంత సమయానికి తల్లి సారమ్మ వచ్చి చూసే సరికి రమ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రమ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమ్య ఉన్నత చదువులు చదివించకుండా పెళ్లి చేశారని ఆవేదన చెందేదని ఆమె తల్లి తెలిపింది.
  Published by:Sumanth Kanukula
  First published: