మాజీ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం.. మంత్రి పేర్ని నానిపై సంచలన ఆరోపణలు

మంత్రి పేర్ని నాని, మట్టా తులసి అనే వారి మీద జయలక్ష్మి ఆరోపణలు గుప్పించారు.

news18-telugu
Updated: July 13, 2019, 7:11 PM IST
మాజీ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం.. మంత్రి పేర్ని నానిపై సంచలన ఆరోపణలు
జయలక్ష్మి, ఆమె రాసిన సూసైడ్ లెటర్
news18-telugu
Updated: July 13, 2019, 7:11 PM IST
మచిలీపట్నంలో 30వ వార్డు మాజీ కౌన్సిలర్ జయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. మంత్రి పేర్ని నాని, మట్టా తులసి తనను వేధిస్తున్నారంటూ ఆమె సూసైడ్ లేఖ రాశారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె లేఖ రాసి నిద్రమాత్రలు మింగారు. ప్రస్తుతం ఆమె ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 24 గడిస్తే కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ‘ఈ ప్రభుత్వంలో ఆడదాని మీద ఇంత కక్షగట్టారు. పేర్ని నాని ఇంత నీచంగా ఆడపిల్లల మీద కక్షసాధింపు చేసిన నాయకుడు. నా చావుకు కారణం మట్టా తులసి, అంగన్ వాడీ టీచర్ యేసు కుమారి, ఆశ వర్కర్ వెంకటేశ్వరమ్మ. వీరు అందరూ నన్ను బతకనివ్వకుండా చేస్తున్నారు. నన్ను టార్చర్ పెడుతున్నారు.’ అని సూసైడ్ లేఖ రాశారు. తన భర్తను బాగా చూసుకోవాలంటూ కుటుంబసభ్యులకు విజ్ఞప్తి చేశారు.

జయలక్ష్మి రాసిన సూసైడ్ లెటర్


జయలక్ష్మి ఆశావర్కర్గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని రాజకీయ వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...