ఐదుగురు కూతుళ్లతో సహా బావిలో దూకిన తల్లి...కొడుకు పుట్టలేదని..

రాణారామ్ స్కూలుకు వెళ్లిన తర్వాత.. ఐదుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ముందుగా ఐదుగురు కుమార్తెలను బావిలో తోసి..అనంతరం తానూ దూకింది.

news18-telugu
Updated: June 27, 2019, 8:08 PM IST
ఐదుగురు కూతుళ్లతో సహా బావిలో దూకిన తల్లి...కొడుకు పుట్టలేదని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమెకు ఐదుగురు కూతుళ్లు..! ప్రతి కాన్పులోనూ ఆమెకు ఆడపిల్లే పుట్టింది. తనకు కుమారుడు లేడని ఆమె తీవ్ర మనో వేదనకు గురయింది. అటు అత్తింటి నుంచి కూడా వేధింపులు మొదలయ్యాయి. భర్త కూడా చిత్రహింసలు పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. ఏ తల్లీ చేయకూడని..చేయలేని పనిచేసింది. ఐదుగురు కూతుళ్లను బావిలోకి నెట్టి...తానూ దూకేసింది. ఈ ఘటనలో ఆరుగురూ చనిపోయారు. రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బావ్డీ గ్రామానికి చెందిన రాణారామ్ టీచర్‌‌గా పనిచేస్తున్నాడు. అతనికి వనూదేవి (38) అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతోష (13), మమత (11), మైనా (9), హంస (9), హేమలత (3) అనే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. తనకు కుమారుడు లేడని వనూదేవి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో బుధవారం రాణారామ్ స్కూలుకు వెళ్లిన తర్వాత.. ఐదుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ముందుగా ఐదుగురు కుమార్తెలను బావిలో తోసి..అనంతరం తానూ దూకింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>