Khammam: ఆ ఫొటోలు చూసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత.. అసలు వాటిలో ఏముంది..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది అతడి భార్య. ప్రేమించి పెళ్లి చేసుకన్న భర్త.. మరో మహిళతో కనిపించడం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.

  • Share this:
    ఓ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది అతడి భార్య. ప్రేమించి పెళ్లి చేసుకన్న భర్త.. మరో మహిళతో కనిపించడం ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ ఖమ్మం జిల్లా బోనకల్‌‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌కు చెందిన రావుట్ల శివ, సంధ్య‌లకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివ, సంధ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితం భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సంధ్య చూసింది. ఆ ఫొటోలు చూసిన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.

    ప్రేమించి పెళ్లి‌చేసుకున్న వ్యక్తి.. ఇలా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం సంధ్యను తీవ్రంగా కలిచివేసింది. కొద్ది రోజులుగా అదే ఆలోచనతో సతమతం అయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

    ఇది చదవండి: Hyderabad: ఆమె డాక్టర్.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను పూర్తిగా నమ్మేసింది.. కూతురికి అనుమానం రావడంతో..

    Andhra Pradesh: అత్యాచారం నుంచి యువతిని కాపాడిన పెంపుడు కుక్క.. భలే తెలివైనది.. అసలేం జరిగిందంటే..

    సంధ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె అత్త, మామలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: