Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఏంటమ్మా.. ప్రాణం అంటే విలువ లేదా.. కదిలే రైలు ముందు దూకిన మహిళ..

ఏంటమ్మా.. ప్రాణం అంటే విలువ లేదా.. కదిలే రైలు ముందు దూకిన మహిళ..

మెట్రోరైలు

మెట్రోరైలు

Delhi: ప్లాట్ ఫామ్ మీద జనాలు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రైలు అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్యాసింజర్స్ అలెర్ట్ అయ్యారు. రైలు ప్లాట్ ఫామ్ దగ్గరకు వస్తుంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.

కొందరు చిన్న పాటి విషయాలకే నూరెళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తారు. ఉద్యోగం రాలేదని, యువతి ప్రేమకు నిరాకరించిందని, ఇంట్లో వారు ఫోన్ కొనివ్వలేదని, బట్టలు కొనివ్వలేదన్న సిల్లి రిజన్స్ తో ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరు.. పిల్లలు పుట్టలేదని, అత్తింటివారు వేధిస్తున్నారని.. కంట్రోల్ తప్పి సూసైడ్ లు చేసుకుంటారు. నూరెళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తారు. నేటి యువతీ, యువకులు ఈవిధంగా విచిత్రమైన ధోరణులకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు... దేశ రాజధాని ఢిల్లీలో (Delhi)  దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ జోర్ బాగ్ స్టేషన్ లో ఉన్న రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. రైలు కోసం వేచిచూస్తుంది. అక్కడ 50 ఏళ్ల మహిళ కూడా ఉంది. రైలు ప్లాట్ ఫామ్ మీదకు వస్తుంది. ఇంతలో మహిళ అందరు చూస్తుండగానే రైలు ముందుకు దూకేసింది. దీంతో ఆమె రైలు కింద (Suicide) పడింది. అక్కడున్న వారు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.

వెంటనే రైలును ఆపారు. ఆమెను అక్కడినుంచి బైటకు తీశారు. వెంటనే రైల్వే సిబ్బంది..ఆమెను.. ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని మార్చూరీలో ఉంచారు. యువతి సూసైడ్ చేసుకొవడానికి గల కారణలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  దారుణ మైన ఘటన జరిగింది.

దేవాస్ జిల్లాలో బోర్ పదవ్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా గిరిజన తెగకు చెందిన  32 ఏళ్ల మహిళ కు ముగ్గురు పిల్లలు. కొన్నిరోజులుగా ఆమె ఇంట్లో నుంచి మాయమైంది. ఆమె కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమె తనప్రియుడి ఇంట్లో ఉన్నట్లు భర్తకు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. ప్రియుడి ఇంట్లో భార్య ఉండటంతో ఆవేషంతో రగిలిపోయాడు.

వెంటనే ఆమెను మెడ పట్టుకుని బైటకు లాక్కొని వచ్చాడు. అందరి ముందే ఆమెను జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించాడు. మహిళ భర్త ఆమెపై ఎక్కికూర్చుని.. ఊరంతా తిరిగాడు. కొందరు ఆమెను ఇష్టమోచ్చినట్లు కొడుతున్నారు. మరికొందరు ఈ ఘటనను సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (video viral) కావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు ఘటనకు కారణమైన 12 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Delhi, Metro Train, Suicide