Karimnagar: రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి.. కిందకు చూస్తే కనిపించిందో షాకింగ్ సీన్.. సంపులో మహిళ, 8 నెలల పాప..!

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో రెండో అంతస్తులో అద్దెకు ఉన్న ఓ వ్యక్తి కిందికి చూశాడు. సంపు తెరచి ఉంది. అందులో ఎవరో పడి ఉన్నట్టు కనిపించింది. వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి చూసే సరికే..

 • Share this:
  కూతురికి పెళ్ళిలో లాంఛనంగా కట్నం ఇచ్చి తల్లిదండ్రులు అత్తారింటికి పంపిస్తారు. అవేమి చాలనట్లు మళ్ళీ అదనపు కట్నాలు తేవాలని భర్త, అత్త మామల వేధింపులు మొదలవుతుంటాయి. ఇలా నిత్యం ఎదో ఒక చోట వరకట్నపు దాహాలకు ఎంతో మంది అబలలు బలవుతున్న పరిస్థితులు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అత్తింటి వరకట్న వేధింపులు భరించలేక ఎనిమిది నెలల చిన్నారితో కలిసి తల్లి శుక్రవారం నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్‌లోని సిక్వాడీ ప్రాంతంలో కలకలం రేపింది. వటౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సిక్వాడీకి చెందిన పాత భూపతి, వజ్రమ్మ దంపతులు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు . వారి కుమారుడు నాగార్జున (35 ) చిప్స్ వ్యాపారం చేస్తున్నాడు.

  మూడేళ్ల కిత్రం వేముల వాడకు చెందిన మౌనిక ( 33 ) తో వివాహం జరిగింది. వీరికి కూతురు సుదీక్ష (8 నెలలు) ఉంది. గతంలో నాగార్జున హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయగా దంపతులు అక్కడే ఉండేవారు. ప్రస్తుతం సిక్ వాడీలో అద్దెకు ఉంటున్నారు. మౌనికను భర్త నాగార్జున, అత్త వజ్రమ్మ , మామ భూపతి రూ.3 లక్షలు అదనంగా కట్నం తేవాలని వేధించేవారు. ఈ విషయమై పలుమార్లు ఇరుకుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి. గురువారం మౌనిక తన తండ్రికి ఫోన్ చేసి భర్త, అత్తమామలు, ఆడపడుచు, కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది.
  ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

  కాస్త పనులు ఉన్నాయనీ, నాలుగు రోజుల తర్వాత నేరుగా వచ్చి వాళ్లతో మాట్లాడతానని ఆ తండ్రి చెప్పాడు. కానీ శుక్రవారం మధ్యాహ్నం వజ్రమ్మ తన భర్త , కొడుకులకు లంచ్ బాక్సు తీసుకొని దుకాణానికి వెళ్లింది. వేధింపులు భరించలేక మౌనిక సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురితో సహా నల్లానీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే ఇంట్లో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు కిందికి చూడగా సంపు తెరిచి అందులో ఎవరో ఉన్నట్లు కనిపించింది. దీంతో మౌనిక భర్త నాగార్జునకు సమాచారం అందించారు. వారు వచ్చి మౌనికను బయటకు తీసేసరికి మృతి చెంది ఉంది. నాగార్జున తండ్రి భూపతి సంపులోకి దిగి వెతకగా పాప మృతదేహం లభించింది. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మౌనిక తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు నాగార్జున, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: కెనడాలో 27 ఏళ్ల తెలుగు కుర్రాడి ఆత్మహత్య వెనుక అసలు కారణమిదా..? ఇంటికి వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసి మరీ..
  Published by:Hasaan Kandula
  First published: