టార్చర్ భరించలేక.. భర్త మర్మాంగాన్ని కోసి కుక్కకు వేసిన భార్య..

హత్యానంతరం మారియా ఇంటినుంచి పరిగెత్తుకురాగా.. పక్కింటి మహిళ ఆమె దుస్తులపై రక్తపు మరకలు గమనించింది. ఏం జరిగిందని ఆరా తీస్తే.. భర్తను చంపేశానని చెప్పింది.

news18-telugu
Updated: September 7, 2019, 12:35 PM IST
టార్చర్ భరించలేక.. భర్త మర్మాంగాన్ని కోసి కుక్కకు వేసిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏళ్లుగా భర్త పెడుతున్న హింసను భరించలేక ఓ భార్య అతనిపై కిరాతకంగా పగ తీర్చుకుంది. తల,మర్మాంగాలు నరికేసి దారుణంగా హతమార్చింది. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది.

ఉక్రెయిన్ మీడియా కథనం ప్రకారం.. మారియా(48),ఒలెక్సండర్(49) భార్యాభర్తలు. ఒలెక్సండర్ చాలాకాలంగా మారియాను శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నాడు. ఇన్నాళ్లు గృహ హింసను భరిస్తూ వచ్చిన మారియా ఇక తట్టుకోలేకపోయింది. అగస్టు 23వ తేదీన ఒలెక్సండర్ ఆఫీస్ నుంచి వచ్చి బెడ్‌రూమ్‌లో ప్రశాంతంగా పడుకోగా.. మారియా గదిలోకి ప్రవేశించింది.రెండు చేతులతో అతని గొంతు నులిమి హత్య చేసింది. అక్కడితో కసి తీరక.. శరీరం నుంచి తలను వేరు చేసింది.మర్మాంగాన్ని కోసేసి ఇంట్లో ఉన్న కుక్కకు ఆహారంగా పడేసింది.

హత్యానంతరం మారియా ఇంటినుంచి పరిగెత్తుకురాగా.. పక్కింటి మహిళ ఆమె దుస్తులపై రక్తపు మరకలు గమనించింది. ఏం జరిగిందని ఆరా తీస్తే.. భర్తను చంపేశానని చెప్పింది. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మారియాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మారియా నేరాన్ని అంగీకరించింది.భర్త పెట్టే హింసకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక హత్యకు పాల్పడినట్టు వెల్లడించింది. హత్యపై స్పందించిన మారియా-ఒలెక్సండర్ కుమారుడు విక్టర్ ఫెసియనోవ్.. తన తల్లిని జీవితంలో క్షమించబోనని అన్నాడు. ఇంకెప్పుడూ ఆమె ముఖాన్ని చూడాలనుకోవడం లేదని తెలిపాడు. ప్రస్తుతం ఘటనపై పోలీసులపై దర్యాప్తు కొనసాగుతోంది.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading