ఆ పరిచయం అతని కొంపముంచింది.. ఆమె మాయలో పడి..

కస్టమ్స్,జీఎస్టీ,ఇతరత్రా ట్యాక్సుల పేరుతో అతని నుంచి రూ.12 లక్షలు లాగేసింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బాధితుడికి అప్పుడు గానీ సీన్ అర్థం కాలేదు.

news18-telugu
Updated: August 19, 2019, 9:12 AM IST
ఆ పరిచయం అతని కొంపముంచింది.. ఆమె మాయలో  పడి..
ప్రతీకాత్మక చిత్రం (Image: REUTERS)
  • Share this:
ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయం ఓ యువకుడి కొంపముంచింది. అతన్ని తన మాయలో పడేసి..ఏకంగా రూ.12లక్షలు కాజేసింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పెద్ద గిఫ్ట్ ఇస్తానని చెప్పి.. అతనికే టోకరా వేసింది.మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌కి చెందిన ఓ యువకుడికి సాండ్రా ఐడా ఆడర్సన్ అనే యువతితో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చాటింగ్స్‌ పెరిగిపోయి.. ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఎప్పుడూ చాటింగ్ చేస్తుండేవారు. ఇదే క్రమంలో ఫ్రెండ్‌షిప్ డే రావడంతో.. తానో పెద్ద గిఫ్ట్ పంపించాలనుకుంటున్నానని
ఆమె చెప్పింది. అందుకు అతను సరేనన్నాడు. అయితే తాను పంపించే కొరియర్ చేరాలంటే.. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ చార్జీలు

చెల్లించాలని.. అందుకు కొంత డబ్బు పంపించాలని అతన్ని కోరింది.అలా కస్టమ్స్,జీఎస్టీ,ఇతరత్రా ట్యాక్సుల పేరుతో అతని నుంచి రూ.12 లక్షలు లాగేసింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బాధితుడికి అప్పుడు గానీ సీన్ అర్థం కాలేదు. వెంటనే పరిగెత్తుకెళ్లి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు