పోలీస్ భార్యనే దోచేసిన నకిలీ లేడీ పోలీస్... భర్తలను కూడా మార్చేసింది

తాను పోలీస్ ఉద్యోగినిని అంటూ ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది ఓ కిలాడీ లేడీ. అయితే ఎట్టకేలకు ఆమె చేతిలో మోసపోయిన మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: April 9, 2019, 8:11 PM IST
పోలీస్ భార్యనే దోచేసిన నకిలీ లేడీ పోలీస్... భర్తలను కూడా మార్చేసింది
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె ఒక మాయలేడీ. నమ్మించి మోసం చేయడం ఆమెకు వెన్నెతో పెట్టిన విద్య. ఫేస్’బుక్‌లో స్నేహం చేయడం... ఆ తరువాత పర్సనల్‌గా వారికి దగ్గర కావడం ఆమె ప్రత్యేకత. అలా వారితో పరిచయం పెంచుకుని... దొరికినంత దోచుకుని ఉడాయించడం ఈ లేడీ దొంగ పని. అయితే ఈ క్రమంలోనే ఏకంగా పోలీస్ ఇంట్లో నుంచి నగలు, నగదు ఎత్తుకెళ్లింది లేడీ దొంగ సారికా షిండే. విదిషా రాజ్యవర్ధన్ అనే పోలీస్ కానిస్టేబుల్ భార్యతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న సారికా... తాను కూడా పోలీస్ ఆఫీసర్‌నే అని ఆమెను బాగా నమ్మించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, ఫేక్ ఐడీ కార్డును కూడా ఆమె చూపించింది. కొంతకాలం నుంచి విదిషా ఇంటికి తరచూ వస్తున్న సారికా... ఆమె ఇంట్లో లేని సమయం చూసి నగదు, నగలు తీసుకుని పారిపోయింది.

ఈ విషయం గమనించిన విదిషా కూతురు... ఆమెకు అసలు విషయం తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు... 33 ఏళ్ల సారికా షిండేను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే నకిలీ లేడీ పోలీస్ కేవలం దొంగతనాలకు మాత్రమే పరిమితం కాలేదని పోలీసుల విచారణలో తేలింది. తాను పోలీస్ ఉద్యోగినిని అంటూ ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది ఈ కిలాడీ లేడీ. పోలీస్ కావడంతో ఆమెపై ఫిర్యాదు చేయడానికి ఆమెను పెళ్లి చేసుకున్న వాళ్లెవరూ ముందుకు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె చేతిలో మోసపోయిన మూడో భర్త... సారికపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సారిక ఫ్యాష్ బ్యాక్, ఆమె భర్తలను మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెపై దొంగతనం కేసుతో పాటు ఛీటింగ్ కేసు కూడా నమోదు చేశారు ముంబై శివార్లలోని మన్‌పడా పోలీసులు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading