Andhra Pradesh: పెళ్లి పేరుతో అమెరికా యువకుడికి గాలం.. అమ్మాయి ఊరికి వచ్చాక..

Crime News: పెళ్లి షాపింగ్‌ కోసం తన అకౌంట్‌లో రూ.7.20 లక్షలు వేయించుకుంది అమ్మాయి. కాబోయే భార్యే కదా అని అతడు కూడా అంత మొత్తం ఆమె ఖాతాలో వేశాడు.

news18-telugu
Updated: October 21, 2020, 9:16 PM IST
Andhra Pradesh: పెళ్లి పేరుతో అమెరికా యువకుడికి గాలం.. అమ్మాయి ఊరికి వచ్చాక..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఎన్నారై సంబంధం అంటూ అమ్మాయిలను మోసం చేసిన యువకుల గురించి చాలాసార్లు విన్నాం. కానీ అలాంటి ఎన్నారై యువకులను బురిడీ కొట్టించే మాయలేడీలు కూడా ఉంటారు. పెళ్లి పేరుతో అమెరికాలో ఉంటున్న యువకుడికి మాయమాటలు చెప్పి.. ఆ తరువాత అతడిని నిండా ముంచేసింది ఓ యువతి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉంటున్న యువకుడిని మ్యాట్రిమోనీలో పరిచయం చేసుకుంది ఓ యువతి. తన తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అంటూ అతడికి మాయమాటలు చెప్పింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వ్యవహారం పెళ్లి దాకా వెళ్లింది.

ఆమె మాటలు విన్న యువకుడు.. ఇక ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఇద్దరు పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అతడికి ఏం చెప్పిందో తెలియదు కానీ.. పెళ్లి ఖర్చుల కోసం యువతి, యువకుడి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది ఆ మాయలేడీ. పెళ్లి షాపింగ్‌ కోసం రూ.7.20 లక్షలు తన అకౌంట్‌లో యువతి వేయించుకుంది. కాబోయే భార్యే కదా అని అతడు కూడా అంత మొత్తం ఆమె ఖాతాలో వేశాడు. ఆ తరువాత అన్నీ ఓకే అని చెప్పడంతో.. ఇండియాలో ల్యాండ్ అయిపోయాడు యువకుడు.

ఆ వెంటనే పెళ్లి చేసుకునేందుకు యువతి ఊరికి వచ్చాడు. అయితే అప్పటికి కానీ అతడికి అసలు విషయం తెలియలేదు. అప్పటివరకు తనతో ఫోన్‌లో మాట్లాడిన యువతి.. ఆ తరువాత నుంచి తన ఫోన్ స్విఛాఫ్ చేసింది. ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ కలవకపోవడంతో... తాను ఆమె చేతిలో మోసపోయానని అతడికి అర్థమైంది. దీంతో చేసేది లేక ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మాయలేడీ గురించి గాలింపు మొదలుపెట్టారు.
Published by: Kishore Akkaladevi
First published: October 21, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading