news18-telugu
Updated: November 6, 2020, 10:36 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను, యువతులను నమ్మించడం.. వారి వ్యక్తిగత ఫొటోలను సేకరించడం.. అనంతరం అవి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం ఇటీవలి కాలంలో సాధారణమైంది. ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళకు గాలం వేసిన ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లంటూ ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమె వద్ద వివిధ అవసరాలంటూ డబ్బులు లాగడం చేసేవాడు. ఈ క్రమంలో ఆ మహిళ గర్భం దాల్చడంతో అబార్షన్ సైతం చేయించాడు. చివరకు అతను తనను మోసం చేస్తున్నాడని ఆ మహిళ గుర్తించి నిలదీయడంతో నీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. అతని వేధింపులు అధికమవడంతో తట్టుకోలేక ఆ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని సైదాబాద్ ప్రాంతంలో నివసిస్తోంది.
వృద్ధుడి అఘాయిత్యంతో బాలికకు గర్భం.. టెర్రస్ పై ప్రసవించి బిడ్డను ఏం చేసిందంటే..ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ మహిళకు అదే ప్రాంతంలోనే నివాసముండే పసుపులేటి అమర్నాథ్ అలియాస్ అమర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం అతను ఆ మహిళతో పరిచయాన్ని పెంచుకున్నాడు. తనకు వివాహమైన విషయం ఆమె వద్ద దాచాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాధితురాలిని నమ్మించాడు. ఆమెతో కొన్నాళ్లు సహజీవనం సైతం చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అనేక అవసరాల పేరు చెప్పి ఆమె వద్ద డబ్బులను తీసుకునేవాడు.
కొన్ని రోజుల తర్వాత అమర్‌కు వివాహం జరిగిందన్న విషయం ఆ మహిళకు తెలియడంతో నిలదీసింది. దీంతో ఆ నిందితుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తాము ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు అమర్ కుటుంబ సభ్యులను ఆశ్రయించింది. అతడు తనకు చేసిన అన్యాయాన్ని వారికి వివరించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే వారు కూడా అతడికే మద్దతు పలికారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Published by:
Nikhil Kumar S
First published:
November 6, 2020, 10:25 AM IST