ప్రియుడి మాయలో పడ్డ వివాహిత.. కొన్నాళ్లు సహజీవనం.. చివరకు..

ప్రియుడి మోజులో పడి భర్తను వదిలిపెట్టి వెళ్లిన ఓ మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

news18-telugu
Updated: August 5, 2020, 10:40 AM IST
ప్రియుడి మాయలో పడ్డ వివాహిత.. కొన్నాళ్లు సహజీవనం.. చివరకు..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పొస్తుంటాయి. క్షణికావేశంలో వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతున్న పలువురు... ఆ తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మడకం నరసింహారావు, జ్యోతి దంపతుల కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. నవీన్ అనే యువకుడి మాయమాటలకు ఆకర్షితురాలైన జ్యోతి... అతడితో కలిసి వెళ్లిపోయింది. కొన్నాళ్ల పాటు అతడితో సహజీవనం చేసింది. కొద్దిరోజులు జ్యోతిని బాగానే చూసుకున్న నవీన్... ఆ తరువాత ఆమెకు ముఖం చాటేశాడు.

తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి పెంచడంతో అతడు ఎక్కడికో వెళ్లిపోయాడు. చివరకు జ్యోతి తన బంధువులను తీసుకుని నవీన్‌ తల్లిదండ్రులను కలవడానికి వెళ్లింది. అయితే వాళ్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తాను తప్పు చేశాననే విషయం ఆమెకు తెలిసొచ్చింది. తాను చేజేతులా కాపురాన్ని కూల్చుకున్నానని అర్థమైంది. అయితే మళ్లీ భర్త దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఉన్న జ్యోతి.. బంధువులతో కలిసి ప్రియుడు నవీన్ ఇంటి ముందు ధర్నా చేసింది. అయితే అతడి జాడ లేకపోవడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: August 5, 2020, 10:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading