రూ.300 రూపాయిల కోసం ప్రయత్నించి ఓ యువతి రూ.1.90లక్షలు పోగొట్టుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన ఉషారాణి అనే యువతి తనకు రూ.300 రావాల్సి ఉండగా కొరియర్ సంస్థకు ఫిర్యాదు చేసింది. ఆమె అమాయకత్వాన్ని అసరగా చేసుకుని సదరు సంస్థ ప్రతినిధి యువతి వద్ద నుంచి రెండు దఫాలుగా రూ.1.90లక్షలు కాజేశాడు. ఆ తర్వాత అనుమానం వచ్చిన అతనికి ఫోన్‌చేయగా మోబైల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె శనివారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఉషారాణి ఆన్లైన్లో ఒక ఐటెమ్ బుక్ చేసింది. కొరియర్ బాయ్ ఆ ఐటమ్‌ను అందజేశాడు. ఐటెంకు సంబంధించిన డబ్బు ఆమె అతని ఇచ్చింది.. అయితే కొరియర్ బాయ్ యువతికి తిరిగి ఇవ్వాల్సిన రూ.300 ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినప్పటికి ఎలాంటి స్పందనలేకపోవడంతో ఆమె సదరు సంస్థ కస్టమర్ కేర్‌కు సంప్రదించింది. ఆమె ఫిర్యాదుకు స్పందించిన సంస్థ.. ఉషారాణికి ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్ చేసి తమకు ఆన్లైన్ ద్వారా పంపితే మీ డబ్బులు తిరిగి ఇస్తామని తెలిపింది.
వారు చేప్పినట్లుగానే చేసిన ఆమె పెద్ద షాక్ తగిలింది. డబ్బు తిరిగి రాకపోగా.. ఆమె ఆకౌంట్ నుంచి మెుదటిగా రూ.91వేలు, తర్వాత రూ.99వేలను అప్లికేషన్‌ను వివరాల అధారంగా ఆ సంస్థ చెందిన వ్యక్తి కాజేశాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.