ఫేస్‌బుక్ ప్రేమికుడిని నమ్మి...పెళ్లి చేసుకుంది...లాడ్జీలో తొలిరాత్రి గడవగానే...దారుణం...

ఆ రాత్రి శోభనం అంటూ యువతితో శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే పెద్దలను ఒప్పించి మరలా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దని ఆమె వాదించింది. అయితే యువతి మాటలను మోహన్ వినలేదు. తన కోరిక తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు.

news18-telugu
Updated: October 25, 2020, 10:18 PM IST
ఫేస్‌బుక్ ప్రేమికుడిని నమ్మి...పెళ్లి చేసుకుంది...లాడ్జీలో తొలిరాత్రి గడవగానే...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మాయిలను మోసం చేయడంలో కొంతమంది హద్దులు దాటేస్తున్నారు. సోషల్ మీడియా విజృంభించడంతో ఇలాంటి కేటుగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అమాయకులైన అమ్మాయిలే వీళ్ల టార్గెట్. నైసు మాటలతోనూ, ఉద్యోగం ఇప్పిస్తాననో, వారిని కష్టాలను శ్రద్ధగా విని దాని నుంచి బయట పడేస్తాననో మాట ఇచ్చి చివరకు వాళ్లను నిలువునా మోసం చేసేస్తన్నారు. తాజాగా వరంగల్ కు చెందిన ఓ యువతికి ఫేస్ బుక్ మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు కర్నాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పరచయం చేసుకున్నాడు. వారి సరదా చాటింగ్ కాస్తా ప్రేమగా మారింది. యువతికి ఇంట్లో కష్టాలు ఉండటంతో ఆమె తన బాధను నిత్యం అతనికి చాటింగ్ ద్వారా పంచుకునేది. తన సవతి తల్లి టార్చర్ పెడుతోందని, తనకు ఇక పెళ్లి కాదని, ఆత్మహత్యే శరణ్యమని మోహన్ తో తన గోడు వెళ్లబోసుకుంది. మోహన్ కూడా ఆమెకు ధైర్యం చెబుతూ, జీవితం పట్ల భరోసా కల్పించాడు. అతడి మాటలకు ఆమె పడిపోయింది. ఇంకేముంది వారి పరిచయం ప్రేమగా మారింది.. అది పెళ్లికి దారి తీసింది.

తన ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోవట్లేదని రహస్యంగా పెళ్లి చేసుకుందామని మోహన్ నమ్మబలికాడు. దీంతో యువతి మోహన్ మాయలో పడింది. మోహన్ ఆమెను నేరుగా హైదరాబాద్ తరలి రమ్మన్నాడు. అతడి మాటలు నమ్మిన యువతి హైదరాబాద్ చేరుకుంది. తన వెంట లక్షన్నర నగదు. అలాగే మొత్తం 10 తులాల బంగారంతో వచ్చింది. ఆమెను రిసీవ్ చేసుకున్న మోహన్ బస్సులో బళ్లారి తీసుకెళ్లాడు. అక్కడే ఓ గదిలో ఆమెను ఉంచాడు. ఉదయమే బళ్లారిలోనే ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడే ఆ రాత్రి శోభనం అంటూ యువతితో శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే పెద్దలను ఒప్పించి మరలా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దని ఆమె వాదించింది. అయితే యువతి మాటలను మోహన్ వినలేదు. తన కోరిక తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక ఆ యువతి మోహన్ మోసానికి బలవుతానేమోనని అనుమానం కలిగినా శారీరకంగా దగ్గరయ్యింది. ఇక ఉదయం నిద్ర లేచి చూడగానే మోహన్ గదిలో కనిపించలేదు. బ్రేక్ ఫాస్ట్ తేవడానికి బయటకు వెళ్లాడేమో అనుకుంది. తిరిగి వస్తాడని ఎదురు చూసింది. ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. అయితే ఆమె తన పర్సు తెరిచి చూడగా, లక్షన్నర మాయం అయ్యాయి. అంతేకాదు ఆమె సెల్ ఫోన్ సహా, నగలు కూడా మాయం అయ్యాయి. దీంతో ఆ యువతి లబోదిబో మన్నది. వెంటనే తన స్నేహితులు, తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేటుగాడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కేసు విచారణలో ఉన్నది.
Published by: Krishna Adithya
First published: October 25, 2020, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading